గురువారం, 19 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : గురువారం, 26 మే 2022 (16:49 IST)

పిటిషనర్లపై తొందరపాటు చర్యలు వద్దు : ఏపీ సీఐడీకి కోర్టు ఆదేశం

tdp leader narayana
టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి నారాయణతో పాటు మిగిలిన పిటిషనర్లపై తొందరపడి ఎలాంటి చర్యలు తీసుకోవద్దని ఏపీ సీఐడీ పోలీసులకు ఏపీ హైకోర్టు ఆదేశించింది. అమరావతి రింగ్ రోడ్డు భూ సమీకరణలో అక్రమాలకు పాల్పడ్డారంటూ మంగళగిరి వైకాపా ఎమ్మెల్యే ఆళ్ళ రామకృష్ణా రెడ్డి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు ఏపీ సీఐడీ పోలీసులు మంత్రి నారాయణతో పాటు.. లింగమనేని సోదరులు, రామకృష్ణ కన్‌స్ట్రక్షన్స్ ప్రతినిధులు తదితరులపై కేసు నమోదు చేసింది. 
 
ఈ కేసులో నారాయణను సీఐడీ పోలీసులు అరెస్టు చేశారు. అయితే, ఆయనకు స్థానికంగా కోర్టు ఆయనకు బెయిల్ మంజూరు చేసింది. ఈ కేసులో తదుపరి చర్యలను నిపుదల చేయాలని కోరుతూ నారాయణతో పాటు లింగమనేని సోదరులు హైకోర్టును ఆశ్రయించారు. దీన్ని విచారణకు స్వీకరించిన హైకోర్టు... పిటిషనర్లపై తొందరపాటు చర్యలు వద్దంటూ సీఐడీ అధికారులను ఆదేశించింది. అలాగే, ఈ కేసు తదుపరి విచారణను వచ్చే నెల 9వ తేదీకి వాయిదావేసింది.