శుక్రవారం, 27 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : మంగళవారం, 31 మే 2022 (08:36 IST)

తిరుపతి శంఖుమిట్ట ప్రాంతంలో కారులో మంటలు

tirumala forest fire
తిరుమల శంఖుమిట్ట ప్రాంతంలో ఓ కారులో మంటలు చెలరేగాయి. షార్ట్ సర్క్యూట్‌తో ఒక్కసారిగా కారులో మంటలు చెలరేగడంతో క్షణాల్లోనే కాంరంతా మంటలు వ్యాపించి పూర్తిగా దగ్ధమైపోయింది. కారులో మంటలు వ్యాపించగానే భక్తులంతా దిగిపోయి తమ ప్రాణాలను కాపాడుకున్నారు. 
 
మరికొందరు భక్తులు అగ్నిమాపకదళ సిబ్బందికి, పోలీసులకు సమాచారం చేరవేశారు. దీంతో వారు అగ్నిమాపక యంత్రాలతో వచ్చి మంటలను ఆర్పివేశాయి. సోమవారం అర్థరాత్రి దాటిన తర్వాత ఈ ఘటన జరిగింది.  అయితే, ప్రమాదానికి గల కారణాలు తెలియాల్సివుంది.