శుక్రవారం, 24 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By సెల్వి
Last Updated : సోమవారం, 30 మే 2022 (11:18 IST)

సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న నయన్, విఘ్నేశ్ వెడ్డింగ్ కార్డ్

nayanatara_vignesh
లేడీ సూపర్ స్టార్ నయనతార, తమిళ సినీ దర్శకుడు విఘ్నేశ్ శివన్ పెళ్లి చేసుకోబోతున్నారు. ఇప్పటికే వీరి నిశ్చితార్థం కూడా జరిగిపోయింది. తిరుమలలో పెళ్లి చేసుకోవాలని వీరు నిర్ణయించారు. ఇటీవలే తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. పెళ్లి చేసుకోబోయే కల్యాణమంటపాన్ని పరిశీలించారు. 
 
తాజాగా వీరిద్దరూ తమ కులదైవం ఆలయానికి వెళ్లారు. చెన్నై నుంచి తిరుచ్చికి విమానంలో వెళ్లిన వీరు... అక్కడి నుంచి తంజావూరు జిల్లా అయ్యంపేట వళుత్తియూరికి వెళ్లి అక్కడ ఉన్న కులదైవం ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. 
 
తమ కులదైవం పాదాల చెంత తొలి పెళ్లి పత్రికను పెట్టినట్టు సమాచారం. జూన్ 9వ తేదీన వీరి వివాహం జరగనుంది. తాజాగా వీరి వివాహ పత్రిక వైరల్ అవుతోంది.

తమిళనాడులోని మహాబలిపురంలో వివాహ వేడుక జరగనుంది. ఇందుకు సంబంధించిన డిజిటల్ ఆహ్వానం ఒకటి సామాజిక మాధ్యమాల్లో హల్‌చల్ చేస్తోంది.
 
ఈ జంట గత ఏడేళ్లుగా సహజీవనం చేస్తోంది. విక్కీ కౌశల్, కత్రినా కైఫ్ వివాహ వేడుక చూసిన వెడ్డింగ్ ప్లానర్‌కు నయన్, విఘ్నేశ్ వివాహ ఏర్పాట్ల బాధ్యతలను అప్పగించినట్టు తెలుస్తోంది. 
 
"నయన్ వెడ్స్ విక్కీ.. 9, జూన్ 2022. డేట్ సేవ్ చేసుకోండి. మహబ్స్" అంటూ డిజిటల్ వెడ్డింగ్ ఇన్విటేషన్‌లో సమాచారం ఉంది.