మంగళవారం, 24 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By సెల్వి
Last Updated : శనివారం, 7 మే 2022 (11:12 IST)

తిరుమలలో నయనతార-విఘ్నేశ్‌ల పెళ్లి.. డేట్ ఫిక్స్

nayanatara_vignesh
హమ్మయ్య.. దక్షిణాది లేడీ సూపర్ స్టార్ నయనతార ఎట్టకేలకు తన ప్రియుడిని పెళ్లాండేందుకు సిద్ధమైంది. వీరిద్దరూ కొన్నేళ్ల పాటు ప్రేమలో వున్నారు. 
 
త్వరలో పెళ్లి చేసుకోబోతున్నారని వార్తలు వచ్చాయి. ఆ వార్తలను నిజం చేసేలా  వీరిద్దరి వివాహం ఈ రాబోతున్న జూన్ నెల 9వ తారీఖున జరగబోతోందట. 
 
అది కూడా తిరుమల తిరుపతి సన్నిధానంలో వారు తమ వివాహం చేసుకోవాలని నిశ్చయించుకున్నట్టుగా తెలుస్తుంది. తిరుమల శ్రీవారిని దర్శిచుకున్న ఈ స్టార్ జంట.. ఆయన సన్నిధిలోనే పెళ్లి ముహూర్తం పెట్టుకున్నట్లు సమాచారం. వారి వివాహ వేడుకకు వారి కుటుంబ సభ్యులు, సన్నిహితులు హాజరవుతారు. అయితే, దీని గురించి అధికారిక ప్రకటన రావాల్సి వుంది. 
 
ఇటీవల శ్రీవారిని దర్శించుకున్న ఈ ప్రేమ పక్షులు ఇటీవల షిర్డీ, అహ్మద్ నగర్‌లో సందర్శించారు. నయనతార మరియు విఘ్నేష్ శివన్ సాయిబాబా ఆశీర్వాదంతో తమ జీవితంలో ఒక కొత్త అధ్యాయాన్ని ప్రారంభించాలని కోరుకుంటున్నట్లు కనిపిస్తోంది.
 
నయనతార విజయ్ సేతుపతి సరసన కాతువాకుల రెందు కాధల్‌లో కనిపించింది. విఘ్నేష్ శివన్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో సమంత కూడా కీలక పాత్రలో నటించారు. ఈ చిత్రానికి ప్రజలతో పాటు విమర్శకుల నుండి మిశ్రమ స్పందన లభించింది. అట్లీ తదుపరి దర్శకత్వం వహిస్తున్న చిత్రంలో షారుఖ్ ఖాన్ సరసన కథానాయికగా నయనతార బాలీవుడ్‌లో అరంగేట్రం చేస్తోంది.