శనివారం, 11 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By సెల్వి
Last Updated : బుధవారం, 4 మే 2022 (13:10 IST)

లాక్‌డౌన్‌లో పెళ్లి.. గాలిలో మూడు ముళ్లు.. వీడియో మళ్లీ వైరల్

marriage
తమిళనాడులోని మధురైకి చెందిన వధూవరులు రాకేష్, దక్షిణ పెళ్లి చేసుకోవాలనుకున్నారు. అందుకోసం ముహూర్తం కూడా ఫిక్స్ చేయించారు. మదురై అమ్మవారి సన్నిధిలో వీరి వివాహం జరగాల్సి ఉంది.
 
అయితే కరోనా కారణంగా తమిళనాడు ప్రభుత్వం సంపూర్ణ లాక్‌డౌన్ ప్రకటించింది. లాక్‌డౌన్‌ రావడంతో పెళ్లి కోసం చేసుకున్న ఏర్పాట్లను రద్దు చేసుకున్నారు. 
 
కానీ తమ పెళ్లిని మాత్రం వాయిదా వేసుకోవాలనుకోలేదు. ఇరు కుటుంబ సభ్యులు మొత్తం 161 మంది కలిసి రెండు గంటల కోసం ప్రత్యేకంగా ఓ విమానాన్ని అద్దెకు తీసుకున్నారు. 
 
మొదట వీరంతా బెంగళూరు నుంచి మదురైకి బయలు దేరి వెళ్లారు. విమానం టేకాఫ్‌ అయిన తరువాత గాల్లోనే పెళ్లి కొడుకు పెళ్లి వధువుకి తాళి కట్టి జంట అవ్వగా.. కుటుంబ సభ్యులు వీరిని ఆశీర్వదించారు. 
 
తిరిగి మళ్లీ మదురై నుంచి బెంగళూరుకు ప్రయాణమయ్యారు. లాక్ డౌన్‌‍లో జరిగిన ఈ పెళ్లి వీడియో ఇప్పుడు మరోసారి సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.