శుక్రవారం, 3 జనవరి 2025
  1. క్రీడలు
  2. క్రికెట్
  3. వార్తలు
Written By ఠాగూర్
Last Updated : గురువారం, 28 ఏప్రియల్ 2022 (09:49 IST)

66 యేళ్ల వయసులో 28 యేళ్ల యువతితో వివాహం

arun lal - saha
భారత క్రికెట్ జట్టుకు చెందిన మాజీ క్రికెటర్ ఒకరు తన 66 యళ్ళ వయసులో 28 యేళ్ల యువతిని పెళ్లాడనున్నారు. ఆ మాజీ క్రికెటర్ పేరు అరుణ్ లాల్. తన చిరకాల స్నేహితురాలైన 28 యేళ్ల బుల్ బుల్ సాహాను పెళ్లాడబోతున్నారు. వీరి వివాహం మే 2వ తేదీన కోల్‌కతాలో జరుగనుంది. 
 
కాగా, అరుణ్ లాల్ ప్రస్తుతం బెంగాల్ క్రికెట్ జట్టుకు కోచ్‌గా వ్యవహరిస్తున్నారు. ఆయన గతంలో ఓ వివాహం జరిగింది. ఆయన తొలి భార్య పేరు రీనా. ఆ తర్వాత అరుణ్ లాల్, రీనాలు పరస్పర అంగీకారంతో విడాకులు తీసుకున్నారు. రీనా అనారోగ్యంతో ఉండటంతో ప్రస్తుతం ఆమెతోనే సహజీవనం చేస్తున్నారు. 
 
ఈ క్రమంలో తన స్నేహితురాలు బుల్ బుల్‌ను పెళ్లి చేసుకుంటాని రీనాకు చెప్పగా ఆమె కూడా సంతోషంగా సమ్మతించింది. ప్రస్తుతం వీరిద్దరి ప్రీ వెడ్డింగ్ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. పైగా, వీరిద్దరి ప్రీవెడ్డింగ్‌ సెలెబ్రేషన్స్‌తో పెళ్లికి వయస్సుతో పనిలేదని అది కేవలం ఒక నంబరు మాత్రమేనని, మనస్సుతోనే పని రుజువు చేశారు. కాగా అరుణ్ లాల్ భారత క్రికెట్ జట్టు తరపున 16 టెస్టులు, 13 వన్డే మ్యాచ్‌లు ఆడారు.