పెళ్లిపీటలెక్కనున్న నయనతార, విఘ్నేశ్.. జూన్‌లో డుం.. డుం.. డుం..
దక్షిణాది లేడీ సూపర్ స్టార్ నయనతార, కోలీవుడ్ దర్శకుడు విఘ్నేశ్ శివన్ ప్రేమలో వున్న సంగతి తెలిసిందే. త్వరలో ఈ జంట పెళ్లిపీటలెక్కనుంది.
నయన్, విఘ్నేష్‌ల పెళ్లికి ఇరుకుటుంబసభ్యులు ముహూర్తాన్ని కూడా ఖరారు చేశారని కోలీవుడ్ వర్గాల బోగట్టా. జూన్ నెలలో వీరి పెళ్లి జరుగబోతుందట.
అందుకు సంబంధించిన ఏర్పాట్లు అన్నీ జరుగుతున్నాయని ఫిలిమ్ నగర్ వర్గాల్లో టాక్ వస్తోంది. ఇక తమ పెళ్లి గురించి నయన్, విఘ్నేష్‌ల నుంచి అధికారిక ప్రకటన రావాల్సిందే.
కాగా, ప్రస్తుతం విఘ్నేష్ శివన్ దర్శకత్వంలో నయనతార ఓ సినిమా చేసింది. అదే `కణ్మనీ రాంబో ఖతీజా. ఇందులో విజయ్ సేతుపతి హీరోగా నటించగా.. సమంత మరో హీరోయిన్‌గా చేసింది.
కొద్ది రోజుల క్రితమే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమాను ఏప్రిల్ 28న ఈ తమిళ్, తెలుగు భాషల్లో విడుదల చేయబోతున్నారు. అలాగే నయనతార చిరంజీవితో కలిసి గాడ్ ఫాదర్ మూవీలో నటిస్తోంది.