శుక్రవారం, 24 జనవరి 2025
  1. ఆధ్యాత్మికం
  2. భవిష్యవాణి
  3. దినఫలం
Written By రామన్

24-04-22 ఆదివారం రాశిఫలాలు - ఇష్టదైవాన్ని ఆరాధించిన మీ సంకల్పం...

astro10
మేషం :- వృత్తి వ్యాపారులకు సంతృప్తి, పురోభివృద్ధి. ఏ ప్రయత్నం కలిసిరాక పోవటంతో ఒకింత నిరుత్సాహం చెందుతారు. విద్యార్థులు బజారు తినుబండారాలు భుజించటం వల్ల అస్వస్థతకు లోనవుతారు. కుటుంబీకులతో కలిసి విందు, వినోదాలలో పాల్గొంటారు. మీ ఆలోచనలు, పథకాలు గోప్యంగా ఉంచండి.
 
వృషభం :- ప్రింటింగ్, స్టేషనరీ రంగాలలోని వారికి మిశ్రమ ఫలితం. వాయిదా పడిన మొక్కుబడులు తీర్చుకుంటారు. సోదరుల నుంచి కీలకమైన సమాచారం అందుకుంటారు. చేస్తున్న పనిపై ఆసక్తి తగ్గే అవకాసం ఉంది. డాక్టర్లు శస్త్ర చికిత్సలు విజయవంతంగా పూర్తి చేస్తారు. వసతి ఏర్పాట్ల విషయంలో చిక్కులు ఎదువవుతాయి.
 
మిథునం :- అంతగా పరిచయం లేని వారికి ధనసహాయం చేసే విషయంలో అప్రమత్తత అవసరం. బంధు మిత్రులతో ఓర్పు, సంయమనంతో మెలగండి. మీ శ్రీమతి సూటిపోటి మాటలు అసహనం కలిగిస్తాయి. మీ అభిప్రాయాలను ఇతరులపై బలవంతంగా రుద్దడం మంచిది కాదని గమనించండి. క్రయ విక్రయాలకు అనుకూలం.
 
కర్కాటకం :- శ్రీవారు, శ్రీమతి విషయంలో మనస్పర్థలు ఏర్పడే అవకాశం ఉంది. ఏది ఎలా జరిగితే అలాగే జరుగనివ్వండి. దేనికీ తొందరపడవద్దు. ఆపద సమయంలో మిత్రులు అండగా నిలుస్తారు. ప్రముఖుల ఇంటర్వ్యూ కోసం అధిక సమయం వేచి ఉండాల్సి వస్తుంది. మీ సంతానం ఇష్టాలకు అడ్డు చెప్పటం మంచిదికాదు.
 
సింహం :- ఆర్థిక పరిస్థితులు మెరుగుపడతాయి. తలచిన పనులలో కొంత అడ్డంకి ఎదురైనా పట్టుదలతో పూర్తి చేస్తారు. మత్స్య కోళ్ళ వ్యాపారస్తులకు లాభదాయకంగా ఉంటుంది. ముఖ్యుల కలియికను గోప్యంగా ఉంచడం మంచిది. రసాయన, ఆల్కహాల్, సుగంధ ద్రవ్య వ్యాపారులకు ఆర్థికాభివృద్ధి, పురోభివృద్ధి కానవస్తుంది.
 
కన్య :- వసతి ఏర్పాట్ల విషయంలో చిక్కులు ఎదువవుతాయి. రుణాల కోసం అన్వేషిస్తారు. మీ కదలికలపై కొంతమంది కన్నేసిన విషయం గమనించండి. ఆపత్సమయంలో సన్నిహితులు అండగా నిలుస్తారు. కుటింబీకుల మధ్య పరస్పర అవగాహనాలోపం. పుణ్యక్షేత్ర సందర్శనాలలో పాల్గొంటారు. దూర ప్రయాణాలు అనుకూలిస్తాయి.
 
తుల :- అతిథి మర్యాదలు బాగుగా నిర్వహిస్తారు. దైవ, సేవా సంస్థలకు సహాయ సహకారా లందిస్తారు. స్త్రీల వాక్ చాతుర్యంనకు, తెలివితేటలకు మంచి గుర్తింపు, రాణింపు లభిస్తుంది. శతృవులపై విజయం సాధిస్తారు. క్రీడా కార్యక్రమాలలో పాల్గొంటారు. ఉపాధ్యాయులకు విశ్రాంతి లభిస్తుంది. ప్రముఖుల కలయికతో పనులు నెరవేరుతాయి.
 
వృశ్చికం :- భాగస్వామిక, సొంత వ్యాపారాలు ఫర్వాలేదనిపిస్తాయి. స్టాకిస్టులకు అభివృద్ధి కానవస్తుంది. ఇతరుల సలహాలను పాటించి సమస్యలను తెచ్చుకోకండి. మీ వాహనం ఇతరులకిచ్చే విషయంలో లౌక్యంగా వ్యవహరించండి. సంఘంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. సోదరుల నుంచి కీలకమైన సమాచారం అందుకుంటారు.
 
ధనస్సు :- శ్రీవారు, శ్రీమతి విషయాల్లో శుభపరిణామాలు సంభవం. నిరుద్యోగులకు ఇంటర్వ్యూలు అనుకూలిస్తాయి. యాదృచ్ఛికంగా ఒక పుణ్యక్షేత్రం సందర్శిస్తారు. కొన్ని పనులు విసుగు కలిగించినా మొండిగాపూర్తి చేస్తారు. మీ కోపాన్ని, చిరాకును ఎక్కువగా ప్రదర్శించటం మంచిది కాదు. అవివాహితులకు అనుకూలమైనకాలం.
 
మకరం :- పెద్దల ఆశీస్సులు, ప్రముఖుల ప్రశంసలు పొందుతారు. దైవ కార్యక్రమాల పట్ల ఏకాగ్రత కుదరదు. కార్మికులకు నూతన ఆలోచనలు స్ఫురిస్తాయి. పారిశ్రామిలకులకు విద్యుత్ లోపం వల్ల ఆందోళనకు గురిఅవుతారు. కుటుంబీకులతో కలిసి విందు, వినోదాలలో పాల్గొంటారు. పెంపుడు జంతువుల గురించి ఆందోళన చెందుతారు.
 
కుంభం :- ఆర్థిక వ్యవహారాలలో ఒడిదుడుకుడు తొలగుతాయి. ప్రత్యర్థులు స్నేహ హస్తం అందిస్తారు. సంగీత, సాహిత్య, కళా రంగాలలోని వారికి మంచి గుర్తింపు, రాణింపు లభిస్తుంది. మీ లక్ష్యాన్ని చేరుకొనే విషయంలో మెళుకువలు అవసరం. కుటుంబ వ్యవహారాల కారణంగా మనస్తాపానికి గురవుతారు.
 
మీనం :- రాజకీయ సినీ కళా రంగాల వారికిని నూతన అవకాశాలు లభిస్తాయి. విదేశాలు వెళ్ళాలనే మా ఆలోచనలు క్రియారూపంలో పెట్టినట్లయితే జయం చేకూరుతుంది. ఒకానొక విషయంలో బంధువుల తీరు నిరుత్సాహం కలిగిస్తుంది. వస్తువులపట్ల ఆపేక్ష అధికమవుతుంది. దూర ప్రయాణాలలో జాగ్రత్త అవసరం.