శుక్రవారం, 24 జనవరి 2025
  1. ఆధ్యాత్మికం
  2. భవిష్యవాణి
  3. దినఫలం
Written By రామన్

21-04-22 గురువారం రాశిఫలాలు - దత్తాత్రేయుడని ఆరాధించి మీ సంకల్పం...

astro10
మేషం :- ప్రైవేటు సంస్థల వారికి అనుకూలం. అందరితో కలసి విందు, వినోదాలలో పాల్గొంటారు. ద్విచక్ర వాహనంపై దూర ప్రయాణాలు మంచివి కాదని గమనించండి. చర్చల విషయంలో స్పష్టమైన నిర్ణయానికి వస్తారు. అనవసర ప్రసంగం వలన అధికారులతో అవగాహన కుదరకపోవచ్చు. ఐరన్ రంగం వారికి ఆటంకాలు.
 
వృషభం :- బ్యాంకు వ్యవహారాలు, ప్రయాణాల్లో మెలకువ వహించండి. సింమెంట్ వ్యాపారస్తులకు సంతృప్తి కానవస్తుంది. ఉపాధ్యాయ రంగాల్లో వారికి మార్పులు అనుకూలిస్తాయి. స్త్రీలు బంధు మిత్రుల నుంచి ఒత్తిడి, మొహమ్మాటాలు ఎదుర్కుంటారు. మీ ముఖ్యుల కోసం ధనం బాగా వెచ్చించవలసి ఉంటుంది.
 
మిథునం :- ఉద్యోగస్తులకు రావలసిన క్లెయిములు మంజూరవుతాయి. బంధువుల మధ్య అనురాగ వాత్సల్యాలు పెంపొందుతాయి. ప్రత్తి, పొగాకు, చెరకు రైతులకు, స్టాకిస్టులకు అనుకూలమైన కాలం. పుణ్యక్షేత్రాలను సందర్శిస్తారు. స్త్రీలకు విదేశీ వస్తువుల పట్ల ఆసక్తి అధికమవుతుంది. వాహనం నడుపునపుడు మెళుకువ అవసరం.
 
కర్కాటకం :- కుటింబీకుల మధ్య పరస్పర అవగాహనాలోపం. ఆలయ సందర్శనాలలో ఇబ్బందులను ఎదుర్కొంటారు. సోదరుల నుంచి కీలకమైన సమాచారం అందుకుంటారు. విద్యార్థులకు క్రీడల పట్ల ఆసక్తి పెరుగును. పోస్టల్, టెలిగ్రాఫ్ రంగాలలో వారికి అనుకూలం. ఏ విషయంలోను హామీ ఇవ్వకుండా లౌక్యంగా దాటవేయండి.
 
సింహం :- పత్రిగ, ప్రైవేటు సంస్థలలోని వారికి మార్పులు అనుకూలిస్తాయి. సోదరీ, సోదరుల మధ్య సంబంధ బాంధవ్యాలు బాగా ఉంటాయి. మీ సంతానం మొండివైఖరి మీకు చికాకు కలిగిస్తుంది. మీ ప్రయత్నాలను కొంత మంది పక్కదారి పట్టించే ఆస్కారం ఉంది జాగ్రత్త వహించండి. నూతన పెట్టుబడులు లాభిస్తాయి.
 
కన్య :- మీకు నచ్చిన వారితో ఉల్లాసంగా గడుపుతారు. ఎలక్ట్రానికల్, కంప్యూటర్ రంగాల వారికి కలసివచ్చే కాలం. ప్రైవేటు సంస్థలలోని వారికి మార్పులు అనుకూలిస్తాయి. ఇచ్చిపుచ్చుకునే వ్యవహారాలు, వాణిజ్య ఒప్పందాలు అనుకూలిస్తాయి. స్త్రీలకు కాళ్లు, నడుము, నరాలకు సంబంధించిన చికాకులు ఎదుర్కోక తప్పదు.
 
తుల :- చిట్‌ఫండ్, ఫైనాన్స్ రంగాలలో వారికి చికాకు తప్పదు. రియల్ ఎస్టేట్ వ్యాపారులకు ఒత్తిడి తప్పదు. శ్రీవారు, శ్రీమతి విషయాల్లో శుభపరిణామాలు సంభవం. ఉపాధ్యాయులకు చికాకులు ఎదురవుతాయి. ముఖ్యమైన వ్యవహారాలలో దీక్ష వహిస్తారు. మీకు రావలసిన ధనం సకాలంలో మీ చేతికి అందదు. స్పెక్యులేషన్ కలిసిరాదు. 
 
వృశ్చికం :- కాంట్రాక్టర్లకు నిర్మాణ పనుల్లో స్వీయ పర్యవేక్షణ ముఖ్యం. ఉద్యోగస్తులు అధికారుల నుంచి ఒత్తిడి, చికాకులను ఎదుర్కొటారు. స్త్రీలు గృహమునకు కావలసిన విలువైన వస్తువులను అమర్చుకుంటారు. కోర్టు వ్యవహారాలు, భూ వివాదాలు పరిష్కారమవుతాయి. పెట్టుబడుల విషయంలో దూకుడు మంచిది కాదు.
 
ధనస్సు :- బంధు మిత్రుల నుంచి మంచి గుర్తింపు, రాణింపు లభిస్తుంది. దూర ప్రయాణాలలో కొత్త వ్యక్తులతో పరిచయాలు ఏర్పడతాయి. నిరుద్యోగులకు ఇంటర్వ్యూలలో జయం చేకూరుతుంది. ప్లీడర్లకు, ప్లీడరు గుమాస్తాలకు విశ్రాంతి లభిస్తుంది. ఉద్యోగస్తుల సమర్థతను అధికారులు గమనిస్తారు. ఆలయాలను సందర్శిస్తారు.
 
మకరం :- రాజకీయ, కళారంగాల వారికి సామాన్యంగా ఉంటుంది. వాహనచోదకులకు మెలకువ వహించండి. భాగస్వాములతో విభేదాలు తలెత్తే ఆస్కారం ఉంది. నిత్యావసర వస్తు ధరలు అధికమవుతాయి. కొత్త రుణాలు, పెట్టుబడుల కోసం యత్నిస్తారు. నిర్ణయాలు తీసుకోవాల్సి వచ్చినపుడు ఆచి, తూచి వ్యవహరించండి. 
 
కుంభం :- మిత్రులకిచ్చిన మాట నిలబెట్టుకోవటం కోసం శ్రమాధిక్యత, ప్రయాసలెదుర్కుంటారు. ఉద్యోగస్తులకు అప్పగించిన బాధ్యతలు సమర్థంగా నిర్వహిస్తారు. లాయర్లకు చికాకులు తప్పవు. ఆత్మవిశ్వాసం రెట్టింపవుతుంది. ఆడిటర్లకు పురోభివృద్ధి కానవస్తుంది. దూరంగా ఉన్న ఆత్మీయులను కలుసుకోవాలనే కోరిక స్ఫురిస్తుంది.
 
మీనం :- ప్రముఖుల కలయిక సాధ్యం కాకపోవచ్చు. తలకు మించిన భాధ్యతలతో తలమునకలౌతుంటే కాస్త ఓప్పిగా వ్యవహరించండి. వాహనం కొనుగోలు చేస్తారు. స్త్రీలు విందు, వినోదాలలో చురుకుగా వ్యవహరించి పలువురిని ఆకట్టుకుంటారు. ఎలక్ట్రికల్, ఎలక్ట్రానికల్, కంప్యూటర్ రంగాల వారికి సదావకాశాలు లభిస్తాయి.