శుక్రవారం, 27 డిశెంబరు 2024
  1. ఆధ్యాత్మికం
  2. భవిష్యవాణి
  3. దినఫలం
Written By రామన్

17-04-22 ఆదివారం రాశిఫలాలు - సూర్య స్తుతి ఆరాధించిన శుభం..

astro5
మేషం :- స్థిరాస్తి క్రయవిక్రయాలకు సంబంధించిన వ్యవహారాలలో మెళకువ అవసరం. కుటుంబంలో చిన్నచిన్న కలహాలు తలెత్తే ఆస్కారం ఉంది. ఉద్యోగ వ్యాపారులకు అధికారుల నుండి ఒత్తిడి, చికాకులు అధికమవుతాయి. అతిధి మర్యాదలు బాగుగా నిర్వహిస్తారు. ప్లీడర్లకు తమ క్షయింట్లు తీరు ఇబ్బందులకు గురిచేస్తుంది.
 
వృషభం :- రాజకీయ నాయకులకు సంఘంలో గౌరవ, మర్యాదలు అధికమవుతాయి. హోటల్, కేటరింగ్ రంగాల్లో వారు పనివారితో ఇబ్బందులు ఎదుర్కొంటారు. మీ సిఫార్సుతో ఒకరికి సదావకాశం లభిస్తుంది. స్త్రీలకు నాణ్యత ధరల పట్ల ఏకాగ్రత చాలా అవసరం. బంధువులతో తెగిపోయిన సంబంధాలు తిరిగి బలపడతాయి.
 
మిథునం :- విద్యుత్ వస్తువుల పట్ల ఏకాగ్రత చూపుతారు. మార్కెటింగ్ రంగాల వారికి ఓర్పు, అంకితభావం చాలా అవసరమని గమనించండి. బంధువుల రాకతో ఖర్చులు అధికమవుతాయి. క్రీడలపట్ల ఆసక్తి కనపరుస్తారు. ఆఫీసులో తొందరపాటు నిర్ణయాలతోకాక, మీ సీనియర్ల సలహాలను తీసుకొని ముందుకు సాగండి.
 
కర్కాటకం :- దైవ, పుణ్య, సేవా కార్యక్రమాలలో చురుకుగా పాల్గొంటారు. ఉద్యోగ రీత్యా ఆకస్మికంగా ప్రయాణం చేయవలసి వస్తుంది. ఎదుటివారితో ఎలా మాట్లాడినా తప్పుగానే భావిస్తారు. ప్లీడర్లకు తమ క్లయింట్లు తీరు ఇబ్బందులకు గురిచేస్తుంది. ప్రణాళికాబద్ధంగా శ్రమించి మీ పనులు సకాలంలో పూర్తిచేస్తారు.
 
సింహం :- ఉపాధ్యాయులకు మార్పులు అనుకూలిస్తాయి. బాకీలు, ఇంటి అద్దెల వసూలులో దూడుకుతనం కూడదు. స్త్రీల ఆరోగ్యం మెరుగుపడటంతో పాటు శారీరక పటుత్వం నెలకొంటుంది. దైవ కార్యాలకు పెద్ద ఎత్తున విరాళాలు ఇవ్వటం వల్ల మంచి గుర్తింపు లభిస్తుంది. బ్యాంకింగ్ రంగాల వారు ఒత్తిడి, చికాకులను ఎదుర్కుంటారు.
 
కన్య :- ప్రముఖుల కలయిక వల్ల ఏమంత ప్రయోజనం ఉండదు. మీ అభిరుచికి తగిన వ్యక్తితో పరిచయాలేర్పడతాయి. సందర్భానుకూలంగా సంభాషించి సమస్యలకు దూరంగా ఉండండి. ఉద్యోగస్తులకు పై అధికారుల నుంచి ఒత్తిడి, చికాకులను ఎదుర్కొంటారు. పుణ్య, సేవా కార్యక్రమాల్లో చురుకుగా వ్యవహరిస్తారు.
 
తుల :- బంధువులను కలుసుకుంటారు. ప్రింటింగ్ రంగాల వారికి ఒత్తిడి పెరుగుతుంది. నిరుద్యోగులు వచ్చిన అవకాశాన్ని తక్షణం వినియోగించు కోవటం ఉత్తమం. స్త్రీలు ఆహార విషయంలో వేళ తప్పి భుజించుట వలన ఆరోగ్యంలో సమస్యలు తలెత్తుతాయి. సమావేశానికి ఏర్పాట్లు చేయడంలో ఇబ్బందులు ఎదురవుతాయి.
 
వృశ్చికం :- విద్యార్థులకు వాహనం నడుపుతున్నపుడు ఏకాగ్రత ముఖ్యం. దైవ, పుణ్య, సేవా కార్యక్రమాల్లో చురుకుగా వ్యవహరిస్తారు. స్త్రీల మాటకు వ్యతిరేకత ఎదురవుతుంది. శస్త్రచికిత్సల సమయంలో వైద్యులకు ఏకాగ్రత అవసరం. కొత్తగా చేపట్టిన వ్యాపారాల్లో నిలదొక్కుకోవటానికి నిరంతర శ్రమ, ఓర్పు ఎంతో ముఖ్యం.
 
ధనస్సు :- మీ కళత్ర మొండివైఖరి మీకెంతో చికాకు కలిగించగలదు. కోర్టు వ్యవహారాల్లో ఫ్లీడర్ల ధోరణి ఆందోళన కలిగిస్తుంది. గతంలో ఇచ్చినహామీల వల్ల వర్తమానంలో ఇబ్బందు లెదురవుతాయి. పుణ్యక్షేత్రాల దర్శనం వల్ల మానసిక ప్రశాంతత చేకూరుతుంది. వాహనం అమర్చుకోవాలనే మీ కోరిక ఫలిస్తుంది.
 
మకరం :- స్త్రీల పట్టుదల, మొండి వైఖరి సమస్యలకు దారితీస్తుంది. ముక్కుసూటిగా పోయే మీ ధోరణివల్ల అనుకోని ఇబ్బందులెదుర్కుంటారు. ప్రముఖులతో పరిచయాలేర్పడతాయి. విద్యార్థులు బజారు తినుబండారాలు భుజించటం వల్ల అస్వస్థతకు లోనవుతారు. కొబ్బరి, పండ్లు, పూల చల్లని పానియ వ్యాపారులకు లాభదాయకం.
 
కుంభం :- ప్రతి అవకాశం చేతదాకా వచ్చి జారిపోయే ఆస్కారం ఉంది. యాదృచ్ఛికంగా ఒక పుణ్యక్షేత్రం సందర్శిస్తారు. రవాణా రంగంలోని వారికి చికాకులు వంటివి ఎదుర్కొంటారు. స్త్రీలకు సంపాదన పట్ల ఆసక్తి పెరుగుతుంది. అతిథి మర్యాదలు బాగుగా నిర్వహిస్తారు. వ్యాపారాల్లో ఆటుపోట్లు ఎదురైనా ధైర్యంగా ముందుకు సాగండి.
 
మీనం :- ఆర్థికస్థితి మెరుగుపడుతుంది. చేతివృత్తులవారికి సదావకాశాలు లభిస్తాయి. గృహ నిర్మాణాలు, మరమ్మతులు చేపడతారు. ఆకస్మిక ఖర్చులు ఆందోళన కలిగిస్తాయి. విద్యార్థులకు క్రీడా కార్యక్రమాలపట్ల ఆసక్తి పెరుగుతుంది. ఉద్యోగస్తులు కొత్త బాధ్యతలు చేపడతారు. నూతన పెట్టుబడులు, లీజు, ఏజెన్సీలకు అనుకూలం.