గురువారం, 9 జనవరి 2025
  1. ఆధ్యాత్మికం
  2. భవిష్యవాణి
  3. దినఫలం
Written By రామన్

16-04-22 శనివారం రాశిఫలాలు - శ్రీ వెంకటేశ్వరుని ఆరాధించిన సర్వదా శుభం..

astro4
మేషం :- రాజకీయాలలో వారికి మంచి గుర్తింపు లభిస్తుంది. దూర ప్రయాణాలలో ఒత్తిడి, చికాకులను ఎదుర్కొంటారు. అవివాహితులు కొత్త అనుభూతికి లోనవుతారు. ఎప్పటి నుండో వాయిదా పడుతూ వస్తున్న పనులు పునఃప్రారంభమవుతుంది. నిరుద్యోగులు నిరుత్సాహం వీడి ఇంటర్వ్యూలకు హాజరుకావటం ఉత్తమం.
 
వృషభం :- బ్యాంకు వ్యవహారాలు మందకొడిగా సాగుతాయి. ఎప్పటి నుంచో మీరు కంటున్న కలలు నిజమయ్యే సమయం దగ్గరపడనుంది. సంఘంలో ఆదర్శజీవనం జరుపుతారు. ఊహగానాలతో కాలం వ్యర్ధం చేయక సతాకాలంను సద్వినియోగం చేసుకోండి. మీరు అభిమానించే వ్యక్తి నుంచి ప్రశంసలు పొందుతారు.
 
మిథునం :- ఆర్థిక విషయాల్లో సాహసోపేతమైన నిర్ణయాలు తీసుకుంటారు. మీ చికాకులు, ఇబ్బందులు తాత్కాలికమేనని గమనించండి. ఉద్యోగ విరమణ చేసిన వారికి అధికారులు, సహోద్యోగులు ఘనంగా వీడ్కోలు పలుకుతారు. వైద్య రంగాల వారికి మంచి గుర్తింపు, ఆదాయం లభిస్తాయి. ఆలయాలను సందర్శిస్తారు.
 
కర్కాటకం :- మందులు, రసాయినిక, ఫ్యాన్సీ, సుగంధ ద్రవ్య వ్యాపారస్తులకు కలసిరాగలదు. స్థిరాస్తి వివాదాలు పరిష్కార దిశగా సాగుతాయి. ప్రయాణాల్లో అసౌకర్యానికి లోనవుతారు. నూతన వ్యక్తులతో స్నేహం ఏర్పడుతుంది. స్త్రీలు భేషజాలకు పోకుండా నిగ్రహంతో వ్యవహరించటం క్షేమదాయకం. గృహోపకరణాలు కొనుగోలు చేస్తారు.
 
సింహం :- ప్రభుత్వ కార్యాలయాలలోని పనులు వాయిదా పడతాయి. శారీరక శ్రమ, విశ్రాంతి లోపం వల్ల స్త్రీల ఆరోగ్యం మందగిస్తుంది. మిమ్మల్ని అభిమానించే వ్యక్తుల మనస్సులను బాధపెట్టకండి. బ్యాంకుపనులు అనుకూలిస్తాయి. గృహోపకరణాలు కొనుగోలు చేస్తారు. వాణిజ్య ఒప్పందాలు, వ్యవహరాలు వాయిదా వేయటం మంచిది.
 
కన్య :- స్త్రీలకు ఆరోగ్యపరంగాను, ఇతరత్రా చికాకులు ఎదుర్కోక తప్పదు. పని చేసే చోట కొన్ని మార్పులు సంభవిస్తాయి. అధికారులతో సంభాషించేటపుడు మెలకువ వహించండి. ఎల్.ఐ.సి, పోస్టల్ ఏజెంట్లకు ఒత్తిడి పెరుగుతుంది. క్రయ విక్రయాలు లాభదాయకం. వాహనం నడుపుతున్నపుడు మెలకువ వహించండి.
 
తుల :- ఉమ్మడి ఆర్థిక వ్యవహారాల్లో మాటపడాల్సివస్తుంది. ఉపాధ్యాయులకు ఒత్తిడి, చికాకులు తప్పవు. సందర్భానుకూలంగా సంభాషించి సమస్యలకు దూరంగా ఉండండి. కార్యాలయంలో కొత్త పరిచయాలు ఏర్పడతాయి. ప్రముఖుల కలయిక ప్రయోజనకరంగా ఉంటుంది. పెద్దల ఆరోగ్యం ఆందోళన కలిగిస్తుంది.
 
వృశ్చికం :- విద్యుత్ రంగంలో వారు మాటపడక తప్పదు. పత్రిక, ప్రైవేటు సంస్థలలోని వారికి ఆశించిన సంస్థలలో అవకాశాలు లభిస్తాయి. శస్త్రచికిత్సల సమయంలో వైద్యులకు ఏకాగ్రత అవసరం. భాగస్వాముల మధ్య అవరోదాలు తలెత్తిన తెలివితో పరిష్కరిస్తారు. ముఖ్యమైన వ్యవహారాలు గోప్యంగా ఉంచండి.
 
ధనస్సు :- రాజకీయాలలో వారికి అభిమాన బృందాలు అధికమవుతాయి. స్త్రీలకు నూతన పరిచయాలు, వ్యాపకాలు అధికమవుతాయి. ఉపాధ్యాయులకు, మార్కెటింగ్ రంగాల వారికి సదవకాశాలు లభిస్తాయి. వైద్య, న్యాయ రంగాల వారికి ఏకాగ్రత ప్రధానం. పుణ్యక్షేత్రాల దర్శనం వల్ల మానసిక ప్రశాంతత చేకూరుతుంది.
 
మకరం :- ఆర్థిక, కుటుంబ సమస్యలు ఒక కొలిక్కి వస్తాయి. ప్రతి విషయంలోను ఆచితూచి వ్యవహరించడం మంచిది. వ్యవసాయరంగంలో వారికి వాతావరణంలో మార్పు సంతృప్తినిస్తుంది. రిజర్వేషన్ రంగాల వారు సంతృప్తిని పొందుతారు. మీరు దేనిని నమ్ముతారో ఆ విషయమై ఇతరులతో ధైర్యంగా మాట్లాడండి.
 
కుంభం :- వృత్తి వ్యాపారాలలో అనుకూల పరిస్థితులు నెలకొంటాయి. విద్యార్థుల ప్రతిభాపాటవాలు వెలుగులోకి వస్తాయి. రవాణా రంగంలోని వారికి లాభదాయకంగా ఉంటుంది. నిరుద్యోగులకు శుభవార్తలు అందుతాయి. సదస్సుల్లో పాల్గొంటారు. విదేశాలు వెళ్ళాలనే మీ కొరిక త్వరలోనే నెరవేరబోతోంది.
 
మీనం :- వాగ్విదాలు, అనవసర విషయాలకు దూరంగా ఉండటం క్షేమదాయకం. ప్రింటింగ్, స్టేషనరీ రంగాలలో వారికి శుభం చేకూరుతుంది. స్థిరాస్తి, క్రయ విక్రయం విషయంలో మంచి లాభం ఉంటుంది. మీ సంతానం మొండివైఖరి మీకెంతో చికాకు, ఆందోళన కలిగిస్తుంది. పెంపుడు జంతువులపట్ల ఆసక్తి చూపుతారు.