గురువారం, 26 డిశెంబరు 2024
  1. ఆధ్యాత్మికం
  2. భవిష్యవాణి
  3. దినఫలం
Written By రామన్

18-04-22 సోమవారం దినఫలాలు - శంకరుడిని పూజించినా మీ సంకల్పం..

astro6
మేషం :- దూర ప్రయాణాలు, చర్చల్లో అంచనాలు ఫలించకపోవచ్చు. నిరుద్యోగులకు ప్రకటనలు, మధ్యవర్తుల విషయంలో అవగాహన ముఖ్యం. వ్యాపార వర్గాల వారి మాటతీరు, స్కీములు కొనుగోలు దార్లను ఆకట్టుకుంటాయి. కుటుంబీకులతో కలసి ఉల్లాసంగా గడుపుతారు. పెద్దల ఆరోగ్యం మందగిస్తుంది.
 
వృషభం :- వారసత్వపు వ్యవహారాలలో చికాకులు తప్పవు. రాజకీయ నాయకులకు మంచి గుర్తింపు లభిస్తుంది. మీ సంతానం ఉన్నతి కోసం తీవ్రంగా శ్రమించాల్సి ఉంటుంది. ఎదుటివారితో ఎలా మాట్లాడినా తప్పుగానే భావిస్తారు. ఖర్చులు పెరిగినా ఆర్థిక ఇబ్బందులేవీ ఉండవు. అందరితో కలిసి విందు వినోదాలలో పాల్గొంటారు.
 
మిథునం :- స్త్రీలకు పరిచయాలు, వ్యాపకాలు అధికమవుతాయి. ఉపాధ్యాయులకు విశ్రాంతి లభిస్తుంది. ద్విచక్రవాహనం పై ప్రయాణాలు మంచిది కాదని గమనించండి. ఆలయాలను సందర్శిస్తారు. పెద్దల సలహాను పాటించి మీ గౌరవాన్ని నిలబెట్టుకుంటారు. హోటల్, కేటరింగ్ రంగాల్లో వారు పనివారితో ఇబ్బందులు ఎదుర్కొంటారు.
 
కర్కాటకం :- మీ ఉన్నతిపై కొందరు అపోహపడే ఆస్కారం ఉంది. రియల్ ఎస్టేట్ రంగాల వారికి నూతన వెంచర్ల విషయంలో పునరాలోచన అవసరం. బాధ్యతగా వ్యవహరిస్తారు. మీ శ్రీమతికి మీరంటే ప్రత్యేకాభిమానం కలుగుతుంది. ప్రేమికుల ఆలోచనలు పెడదారి పట్టే ఆస్కారం ఉంది. పనుల ప్రారంభంలో ఆటంకాలెదురవుతాయి.
 
సింహం :- వస్త్ర వ్యాపారులు పనివారలను ఓ కంట కనిపెట్టుకుని ఉండటం శ్రేయస్కరం. పుణ్యక్షేత్రాల దర్శనం వల్ల మానసిక ప్రశాంతత చేకూరుతుంది. బ్యాంకు వ్యవహారాలలో అపరిచిత వ్యక్తులపట్ల అవసరం. పట్టుదలతో యత్నాలు సాగించండి. మీ అభిప్రాయాలను ఇతరులపై బలవంతంగా రుద్దడం మంచిది కాదని గమనించండి.
 
కన్య :- స్త్రీలకు ఇరుగు పొరుగువారి నుంచి అవమానాలను ఎదుర్కొంటారు. కొన్ని సమస్యలు చిన్నావే అయిన మనశ్శాంతి దూరం చేస్తారు. స్థిమితంగా ఆలోచించి నిర్ణయం తీసుకోవాలి. ఖర్చులకు వెనుకాడరు. రాజకీయనాయకులకు గుర్తింపు లభించదు. మత్స్య కోళ్ళ వ్యాపారస్తులకు లాభదాయకంగా ఉంటుంది.
 
తుల :- మీ సిఫార్సుతో ఒకరికి అవకాశం లభిస్తుంది. సమర్థతకు ఆలస్యంగా గుర్తింపు లభిస్తుంది. పనులు అస్తవ్యస్తంగా సాగుతాయి. మీ ఇష్టాయిష్టాలను సున్నితంగా వ్యక్తం చేయండి. ప్రముఖులకు విలువైన వస్తువులు కొనుగోలు చేస్తారు. అవివాహితులు ఉత్సాహంగా ఉంటారు. బంధు మిత్రులు మీ నుంచి ధనసహాయం ఆశిస్తారు.
 
వృశ్చికం :- ఎవరినీ తక్కువ అంచనా వేయొద్దు. ఉపాధ్యాయులకు మార్పులు అనుకూలిస్తాయి. పరిచయస్తుల రాక ఇబ్బంది కలిగిస్తుంది. పెద్ద మొత్తం ధన సహాయం క్షేమంకాదు. మీ సంతానం భవిష్యత్తుకోసం ప్రణాళికలు రూపొందిస్తారు. వ్యాపారాలు పుంజుకుంటాయి. ప్రయాణంలో జాగ్రత్త అవసరం. ఆలయాలను సందర్శిస్తారు.
 
ధనస్సు :- వ్యాపారాల్లో నిలదొక్కుకుంటారు. ఉద్యోగస్తులకు విశ్రాంతి లభిస్తుంది. విలాసాలకు బాగావ్యయం చేస్తారు. హోటల్, కేటరింగ్ రంగాల్లో వారు పనివారితో ఇబ్బందులు ఎదుర్కొంటారు. కుటుంబీకులతో ఉల్లాసంగా గడుపుతారు. మాట్లాడలేనిచోట మౌనం వహించడం మంచిది. బంధువులతో సత్సంబంధాలు నెలకొంటాయి.
 
మకరం :- వృత్తి నైపుణ్యం పెంచుకోవటానికి యత్నించండి. రుణ విముక్తులవుతారు. పట్టుదలతో శ్రమించిన గాని పనులు పూర్తి కావు. ప్రస్తుత వ్యాపారాలే శ్రేయస్కరం. సన్నిహితులతో కలిసి చేపట్టిన పనులు సమీక్షిస్తారు. ఈ రోజు మొహమ్మాటాలకు పోవద్దు. సంప్రదింపులు, ఒప్పందాలకు అనుకూలం. ఆరోగ్యం పట్ల శ్రద్ధ అవసరం.
 
కుంభం :- ఆర్థిక అంచనాలు ఫలిస్తాయి. కుటుంబ విషయాలు గోప్యంగా ఉంచండి. పరిచయస్తులు ధనసహాయం అర్థిస్తారు. బంధు మిత్రులను దూరంగా ఉంచండి. పెద్దమొత్తం సరకు నిల్వలో జాగ్రత్త అవసరం. ఎవరినీ అతిగా విశ్వసించటం మంచిదికాదు. కొబ్బరి, పండ్ల, పూల, కూరగాయల వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి.
 
మీనం :- వృత్తి, వ్యాపారులకు సమస్యలెదురైనా ఆదాయానికి కొదవ ఉండదు. అనుకున్నది సాధించే వరకు అవిశ్రాంతగా శ్రమిస్తారు. విద్యార్థులు ఇతురుల వాహనం నడిపి ఇబ్బందులకు గురికాకండి. కావలసిన వ్యక్తుల కోసం పడిగాపులు తప్పవు. ఎదుటివారితో ముక్తసరిగా సంభాషిస్తారు. కానివేళలో ఇతరుల రాక ఇబ్బంది కలిగిస్తుంది.