గురువారం, 9 జనవరి 2025
  1. ఆధ్యాత్మికం
  2. భవిష్యవాణి
  3. దినఫలం
Written By రామన్

22-04-22 శుక్రవారం రాశిఫలాలు - గౌరిదేవిని ఆరాధించినా మనోసిద్ది..

astro11
మేషం :- ఆర్థిక వ్యవహారాలలో ఆటంకాలు ఎదురైనా అధికమిస్తారు. ఆడిటర్లు అసాధ్యమనుకున్న కేసులు సునాయాసంగా పరిష్కరిస్తారు. నిరుద్యోగులు నిరుత్సాహం వీడి శ్రమించిన ఫలితాలొస్తాయి. ఉద్యోగలస్తులకు ఇంక్రిమెంట్లు, పదోన్నతులు వంటివి పెరుగుతాయి. మిత్రుల ద్వారా సహాయ సహకారములు అందుకుంటారు.
 
వృషభం :- బ్యాంకు లావాదేవీలకు అనుకూలం. పూర్వానుభవంతో ముందుకు సాగుతారు. స్పెక్యులేషన్లు లాభిస్తాయి. ఎప్పటి నుంచో ఆగివున్న పనులు పునఃప్రారంభిస్తారు. వ్యాపారంలో మార్పులకై చేయుయత్నాలు ఫలిస్తాయి. ప్రముఖుల కలయిక సాధ్యం కాకపోవచ్చు. రావలసిన మొండి బాకీలు సైతం వసూలు కాగలదు.
 
మిథునం :- నిరుద్యోగులకు ప్రకటనల విషయంలో అప్రమత్తత అవసరం. స్థిరచరాస్తుల విషయంలో ఏకీభావం కుదరదు. మీ కళత్ర మొండివైఖరి మీకు ఎంతో చికాకు కలిగిస్తుంది. రాజకీయనాయకులకు ప్రయాణాలలో అపరిచిత వ్యక్తులపట్ల మెళుకువ అవసరం. విద్యార్థినులకు ప్రేమ వ్యవహారాల్లో ఒత్తిడి, చికాకులు తప్పవు.
 
కర్కాటకం :- ఖర్చులు ముందుగా ఊహించినవి కావడంతో ఇబ్బందులు తలెత్తవు. ఇచ్చిపుచ్చుకునే వ్యవహారాల్లో జాగ్రత్త వహించండి. ప్రైవేటు సంస్థలలోని వారికి మార్పులు అనుకూలిస్తాయి. కాంట్రాక్టర్లు ప్రముఖుల సహకారంతో పెద్ద పెద్ద కాంట్రాక్టులు చేజిక్కించుకుంటారు. నూతన ప్రదేశాలు సందర్శిస్తారు.
 
సింహం :- ప్రముఖుల సహకారంతో మీ సమస్యలు పరిష్కారమవుతాయి. ఆకస్మిక ధనప్రాప్తి, వాహనయోగం పొందుతారు. మొక్కుబడులు తీర్చుకుంటారు. దంపతుల మధ్య కలహాలు, పట్టింపులు ఎదుర్కొంటారు. స్త్రీలు వస్త్ర, ఆభరణాల పట్ల ఆసక్తి వ్యవహరిస్తారు. ఉద్యోగస్తులు శుభవార్తలు వింటారు. ప్రభుత్వ సంస్థలతో పనులు పూర్తవుతాయి.
 
కన్య :- పౌరోహితులకు, వృత్తులలో వారికి శ్రమకు తగిన ప్రతిఫలం కానవచ్చును. చిన్నతరహా పరిశ్రమలలో వారికి కలిసివచ్చే కాలం. పెద్దల ఆరోగ్యం మందగిస్తుంది. భాగస్వామిక చర్చల్లో మీ ప్రతిపాదనలకు మిశ్రమ స్పందన ఎదురవుతుంది. వాహన చోదకులకు చికాకులు తప్పవు. ఎదురు చూడని అవకాశాలు దగ్గరకు వస్తాయి.
 
తుల :- స్త్రీలకు వైద్య సలహాలు, ఔషధ సేవనం తప్పవు. ఆత్మీయుల నుండి ఆహ్వానాలు అందుకుంటారు. అధికారులతో సంభాషించేటపుడు సంయమనం పాటించండి. బంధు మిత్రులతో ఉల్లాసంగా గడుపుతారు. రవాణా రంగాల వారికి లాభదాయకంగా ఉంటుంది. బంగారు, వెండి, వస్త్ర రంగాలలో వారికి మెళుకువ అవసరం.
 
వృశ్చికం :- వ్యాపారాభివృద్ధికి పలు పథకాలు అమలు చేస్తారు. స్త్రీలు వస్త్రములు, ఆభరణములు వంటి వస్తువులు కొనుగోలు చేస్తారు. నిరుద్యోగులు ఇంటర్వ్యూలకు సంబంధించిన లేఖలు అందుకుంటారు. ఎలక్ట్రానికల్, కంప్యూటర్ రంగాల పట్ల ఆసక్తి పెరుగును. ఉత్తర ప్రత్యుత్తరాలు సంతృప్తిగా సాగుతాయి.
 
ధనస్సు :- తల పెట్టిన పనులలో విఘ్నాలు, చీటికి మాటికి అసహనం ఎదుర్కొటారు. పెరిగిన కుటుంబ అవసరాలు, రాబడికి మించిన ఖర్చుల వల్ల ఆటు, పోట్లు తప్పవు. వ్యాపారాల్లో కొంత నిరాశ తప్పదు. స్త్రీలు భేషజాలకు పోకుండా నిగ్రహంతో వ్యవహరించటం క్షేమదాయకం. వృత్తి వ్యక్తిగత నిర్ణయాల పట్ల సమన్వయం పాటించండి.
 
మకరం :- మందులు, ఎరువులు, సుగంధ ద్రవ్య వ్యాపారస్తులకు కలిసి వచ్చే కాలం. ఒక కార్యం నిమిత్తం దూర ప్రయాణం చేయవలసి వస్తుంది. ఇతరులకు మేలు చేసి ఆదరణ పొందుతారు. దూరప్రయాణాల ఏర్పాట్లు ఫలించకపోవచ్చు. మీ సంతానం మొండి వైఖరి మీకు ఎంతో చికాకు కలిగిస్తుంది. సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు.
 
కుంభం :- రచయితలకు, పత్రికా రంగంలో వారికి కీర్తి, గౌరవాలు పెరుగుతాయి. ఉద్యోగస్తుల బదిలీ యత్నాలు ఫలిస్తాయి. ప్రయాణాల్లో చికాకులు, ప్రయాసలు తప్పవు. విద్యుత్ వస్తువుల పట్ల ఏకాగ్రత చూపుతారు. కుటుంబ సభ్యులతో ఉల్లాసంగా కాలం గడుపుతారు. పెంపుడు జంతువులపై ప్రేమ, శ్రద్ధ చూపిస్తారు.
 
మీనం :- కొబ్బరి, పండ్ల, పానీయ వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. బ్యాంకు వ్యవహారాలలో పరిచయం లేని వ్యక్తులతో మితంగా సంభాషించండి. బాకీల వసూలు కాకపోగా ఇబ్బందులెదుర్కుంటారు. కుటుంబ సభ్యుల వైఖరిని సమీక్షించుకుంటారు. వాతావరణంలో మార్పు వల్ల స్త్రీల ఆరోగ్యం మందగిస్తుంది.