గురువారం, 9 జనవరి 2025
  1. ఆధ్యాత్మికం
  2. భవిష్యవాణి
  3. దినఫలం
Written By రామన్
Last Updated : శనివారం, 23 ఏప్రియల్ 2022 (08:37 IST)

23-04-22 శనివారం రాశిఫలాలు - రమా సమేత సత్యనారాయణ స్వామిని పూజిస్తే..?

astro12
మేషం :- మీ విలాసాలకు సంతోషాలకు ధనం అధికంగా వ్యయం చేస్తారు. ఎదుటివారి మాట తీరు మనస్తాపం కలిగిస్తుంది. నూతన వ్యాపారాల పట్ల దృష్టి సారిస్తారు. పోటీ పరీక్షలలో అనుకూల ఫలితాలు సాధిస్తారు. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. పెద్దల ఆరోగ్య విషయంలో జాగ్రత్త వహించుట మంచిది.
 
వృషభం :- ఆడిటర్లు, అక్కౌంట్స్ రంగాల వారికి ఒత్తిడి, పనిభారం అధికం. పుణ్యక్షేత్రాలను సందర్శిస్తారు. అంతగా పరిచయం లేని వ్యక్తులకు దూరంగా ఉండటం మంచిది. స్త్రీలకు విదేశీ వస్తువులపట్ల ఆసక్తి అధికమవుతుంది. ప్రేమికులకు ఎడబాటు, చికాకులు తప్పవు. గృహంలో మరమ్మతులు, మార్పులు చేపడతారు.
 
మిథునం :- మీ కుటుంబీకుల వైఖరి మీకు ఎంతో చికాకు కలిగిస్తుంది. పెద్దల ఆరోగ్యంలో సంతృప్తి కానవస్తుంది. కోర్టు వ్యవహారాలు వాయిదా పడుట మంచిదని గమనించండి. బోకర్లకు, ఏజెంట్లకు, రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులకు ఒడిదుడుకులను ఎదుర్కొంటారు. శస్త్రచికిత్స చేయునపుడు మెళుకువ అవసరం. 
 
కర్కాటకం :- భాగస్వామ్యుల మధ్య అసందర్భపు మాటలు తలెత్తే అవకాశం ఉంది. జాగ్రత్త వహించండి. నిరుద్యోగులకు ఎటువంటి సదావకాశం లభించినా సద్వినియోగం చేసుకోవడం మంచిది. నూతన పెట్టుబడుల విషయంలో ఆచి తూచి వ్యవహరించండి. వాహనం ఇతరులకు ఇచ్చి ఇబ్బందులను ఎదుర్కొంటారు.
 
సింహం :- బ్యాంకు వ్యవహారాలలో మెళుకువ అవసరం. మీ సంతానం మొండివైఖరి మీకు ఎంతో చికాకు కలిగిస్తుంది. పండ్లు, పూలు, కొబ్బరి, చల్లని పానీయ పారులకు లాభదాయకంగా ఉంటుంది. విద్యార్థులకు క్రీడా కార్యక్రమాలపట్ల ఆసక్తి అధికమవుతుంది. రాజకీయనాయకులకు ప్రయాణాలలో మెళుకువ అవసరం.
 
కన్య :- విద్యుత్ రంగాల వారికి పనిభారం అధికమవుతుంది. నూనె, ఇనుము, కంది, మిర్చి, పత్తి వ్యాపారస్తులకు, స్టాకిస్టులకు అభివృద్ధి కానవస్తుంది. ఆలయాలను సందర్శిస్తారు. మీ శ్రీమతి మొండి వైఖరి మీకు ఎంతో చికాకు కలిగిస్తుంది. ఉపాధ్యాయులకు యాజమాన్యం నుండి, ఒత్తిడి, చికాకులు వంటివి అధికమవుతాయి.
 
తుల :- ఆర్థికంగా బాగుగా స్థిరపడతారు. ఉద్యోగస్తులకు పై అధికారుల నుంచి మంచి గుర్తింపు, రాణింపు లభిస్తుంది. సోదరీ, సోదరుల మధ్య మనస్పర్థలు తలెత్తుతాయి. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. మీ సంతానం కోసం ధనం అధికంగా వ్యయం చేస్తారు. ప్రముఖులతో పరిచయాలు ఏర్పడతాయి.
 
వృశ్చికం :- కుటుంబ సభ్యులతో కలసి విందు, వినోదాలలో పాల్గొంటారు. గత కొంత కాలంగా వేధిస్తున్న సమస్యలకు పరిష్కార మార్గం గోచరిస్తుంది. ఏదైనా స్థిరాస్తి అమ్మే ప్రయత్నంలో ఇబ్బందులు తప్పవు. ధనం ఎవరికైనా ఇచ్చినా తిరిగి రాజాలదు. కొత్త కొత్త ఆలోచనలు క్రియారూపంలో పెట్టినా జయం పొందుతాయి.
 
ధనస్సు :- గృహంలో మరమ్మతులు, మార్పులు చేపడతారు. స్త్రీల షాపింగ్ లోను, చెల్లింపులలోనూ అప్రమతత్తత అవసరం. క్రీడాకారులకు ప్రోత్సాహకరం. హామీలు, మధ్యవర్తిత్వాలకు దూరంగా ఉండటం మంచిది. బంధువుల రాకతో ఆదాయానికి మించి ఖర్చులు అధికమవుతాయి. ప్రేమికులకు ఎడబాటు, చికాకులు తప్పవు.
 
మకరం :- ఆర్థిక వ్యవహారాల్లో కొంత పురోగతి సాధిస్తారు. బంధువుల రాకతో గృహంలో సందడి కానవస్తుంది. స్త్రీలకు పనివారితో ఒత్తిడి, చికాకులు అధికమవుతాయి. కుటుంబీకులతో ఏకీభవించలేరు. దైవసేవా కార్యక్రమాలలో శ్రమాధిక్యత, ప్రయాసలను ఎదుర్కొంటారు. కొన్ని సంఘటనలు మిమ్మల్ని ఆశ్చర్యపరుస్తాయి.
 
కుంభం :- మీ కళత్ర మొండివైఖరి మీకు ఎంతో చికాకు కలిగిస్తుంది. ఆత్మీయులతో వేడుకలు, వినోదాలలో పాల్గొంటారు. ఇతరులతో మాట్లాడేటప్పుడు మనస్సు విప్పి మాట్లాడండి. ఇతరులకు ఇచ్చిన ధనం తిరిగి రాబట్టుకోవటం సాధ్యం కాదని గమనించండి. గత తప్పిదాలు పునరావృతంకాకుండా తగు జాగ్రత్తలు తీసుకోవలసి ఉంటుంది.
 
మీనం :- వృత్తి, ఉద్యోగ సమస్యల నుంచి ఊరట లభిస్తుంది. పాత వస్తువులను కొనుగోలు చేసి ఇబ్బందులను ఎదుర్కొంటారు. కొన్ని వ్యవహారాలు మీరే సమీక్షించుకోవటం క్షేమదాయకం. వాహనచోదకులకు మెలకువ వహించండి. నిరుద్యోగులు భేషజాలకు పోకుండా వచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకోవడం మంచిది.