బుధవారం, 8 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ఠాగూర్
Last Updated : సోమవారం, 14 మార్చి 2022 (10:28 IST)

నయనతారకు వివాహమైందా? .. నుదుటిన బొట్టు.. భర్తతో కలిసి...

కోలీవుడ్ హీరోయిన్ నయనతారకు పెళ్ళి జరిగినట్టు సామాజిక మాధ్యమాల్లో ఓ వార్త చక్కర్లు కొడుతుంది. ఇటీవల తన ప్రియుడు, కోలీవుడ్ దర్శకుడు విఘ్నేష్‌తో కలిసి ఆమె చెన్నై ప్యారీస్‌లోని కాళికాంబాల్ ఆలయానికి వెళ్లి అమ్మవారిని దర్శనం చేసుకున్నారు. ఆ సమయంలో ఆమె నుదుట బొట్టుతో కనిపించి ప్రతి ఒక్కరినీ ఆశ్చర్యపరిచారు.
 
గత కొన్ని రోజులుగా విఘ్నేష్, నయనతారలు పీకల్లోతు ప్రేమలో మునిగిపోయివున్నారు. ఈ క్రమంలో తాజాగా వీరిద్దరూ కాళికాంబాల్ ఆలయంలో కనిపించి సందడి చేశారు. 
 
అక్కడ పూజ ముగించుకుని వచ్చిన నయన్‌ను చూసిన జనాలు వీరికి పెళ్ళి అయిపోయిందనే నిర్ధారణకు వచ్చేశారు. నదుటిన కుంకుమ పెట్టుకుని నయనతార దర్శనమిచ్చారు. దీంతో వీరికి పెళ్లి అయిపోయిందని, అయితే, ఈ విషయాన్ని వీరు దాస్తున్నారనే ప్రచారం సాగుతోంది.