మంగళవారం, 21 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ఠాగూర్
Last Updated : మంగళవారం, 8 మార్చి 2022 (14:52 IST)

భార్యతో విడాకులు తీసుకున్న కోలీవుడ్ దర్శకుడు

కోలీవుడ్ చిత్రపరిశ్రమకు చెందిన మరో స్టార్ దర్శకుడు బాలా తన భార్యతో తెగదెంపులు చేసుకున్నారు. గత మూడేళ్ళుగా వేర్వేరుగా ఉంటూ వచ్చిన ఈ దంపతులు సోమవారంతో చట్టపరంగా విడాకులు పొందారు. 
 
ఇటీవలి కాలంలో అనేక మంది సెలెబ్రిటీలు విడాకులు తీసుకుంటున్నారు. ఆ క్రమంలో ఈ కోలీవుడ్ జంట విడాకులు తీసుకున్నారు. తమిళ దర్శకుడు, జాతీయ అవార్డు గ్రహీత బాల తన భార్య ముధుమలార్‌తో విడిపోయారు. ప్రస్తుతం ఈ వార్త కోలీవుడ్‌లో చర్చనీయాంశంగా మారింది. 
 
నిజానికి ఈ దంపతుల మధ్య గత నాలుగేళ్ల క్రితం మనస్పర్థలు తలెత్తాయి. అప్పటి నుంచి వీరిద్దరూ వేర్వేరుగా జీవిస్తున్నార. విడాకుల కోసం చెన్నై ఫ్యామిలీ కోర్టును ఆశ్రయించగా, చివరికి కోర్టు విడాకులు మంజూరు చేసింది. అయితే, వీరిద్దరూ విడిపోవడానికి గల కారణాలు మాత్రం వెల్లడించలేదు. 
 
కాగా, ఈ వీరిద్దరూ గత 2004లో మదురైలో వివాహం చేసుకున్నారు. వీరి దాంపత్య జీవితానికి గుర్తుగా ప్రార్థన అనే కుమార్తె కూడా వుంది. తాజాగా కోర్టు విడాకులు మంజూరు చేయడంతో వీరి 17 యేళ్ల వైవాహిక జీవితానికి తెరపడింది.