గురువారం, 19 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By సెల్వి
Last Updated : శనివారం, 12 మార్చి 2022 (07:51 IST)

హిజ్రా అఖిలను పెళ్లాడిన యువకుడు

ఓ యువకుడు హిజ్రాను పెళ్లాడాడు. మూడేళ్ళ క్రితం ఏర్పడిన వారిద్దరి పరిచయం ఇపుడు మూడుముళ్ల బంధంతో ముగిసింది. తమ పెద్దలను ఒప్పంచి హిజ్రాను ఆ యువకుడు పెళ్లి చేసుకున్నాడు. ఇది తెలంగాణ రాష్ట్రంలోని కొత్తగూడెం జిల్లా ఇల్లెందులో జరిగింది. 
 
తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, భూపాలపల్లి మండలంలోని రూపేశ్‌ అనే యువకుడికి ఆళ్ళపల్లి మండల పరిధిలోని అనంతోగు గ్రామానికి చెందిన అఖిల అనే హిజ్రాతో మూడేళ్ల క్రితం పరిచయం ఏర్పడింది. ఈ పరిచయం కాస్త స్నేహం, ప్రేమగా మారింది. దీంతో వారిద్దరూ గాఢ ప్రేమికులైపోయారు. 
 
ఈ క్రమంలో ఇల్లెందులో ఓ ఇంటిని అద్దెకు తీసుకుని ఇద్దరూ కలిసివుంటూ వచ్చారు. అంటే వీరు గత మూడు నెలలుగా సహజీవనం చేస్తూ వచ్చారు. అయితే, తల్లిదండ్రులకు చెప్పకుండా ఇలా రహస్యంగా ఉండటం ఇష్టంలేని రూపేశ్ తమ ప్రేమను తల్లిదండ్రులకు చెప్పి, వారిని ఒప్పించి ఓ ఇంటివాడయ్యాడు. వీరిపెళ్లి ఘనంగా జరుపుకున్నారు.