బుధవారం, 8 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By సెల్వి
Last Updated : బుధవారం, 2 మార్చి 2022 (22:54 IST)

అందుకే నాకు ఇంకా పెళ్లి కాలేదు అనుకుంటా: ప్రభాస్

బాహుబలి ప్రభాస్ ప్రస్తుతం టాలీవుడ్‌లో మోస్ట్ ఎలిజబుల్ బ్యాచ్‌లర్. ప్రస్తుతం ప్రభాస్ జిల్ ఫేమ్ రాధాకృష్ణ దర్శకత్వంలో రాధే శ్యామ్ మూవీ చేశాడు. ఎట్టకేలకు రిలీజ్‌కు సిద్ధమైంది. ఈ నెల 11 న ఈ మూవీ పలు భాషల్లో ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది. 
 
ఈ క్రమంలో ప్రమోషన్‌లో భాగంగా మంగళవారం చిత్ర రిలీజ్ ట్రైలర్‌ను ముంబై‌లో గ్రాండ్‌గా విడుదల చేసారు. ఈ కార్యక్రమానికి ప్రభాస్, పూజా హెగ్డేలతో పాటు డైరెక్టర్ , నిర్మాతలు హాజరయ్యారు. ట్రైలర్‌లో 'ప్రేమ విషయంలో ఆదిత్య ప్రిడిక్షన్ తప్పు' అని చెప్పే డైలాగ్ అందరినీ బాగా ఆకట్టుకుంది. 
 
ట్రైలర్ లాంచ్ సందర్భంగా మీడియా వారు ప్రభాస్ వద్ద దీని గురించి ప్రస్తావించారు. రియల్ లైఫ్‌లో ప్రేమ విషయంలో ఎన్ని సార్లు మీ ప్రిడిక్షన్ తప్పింది? అని ప్రభాస్‌ను ప్రశ్నించగా.. 'చాలా సార్లు జరిగింది.. అందుకే నాకు ఇంకా పెళ్లి కాలేదు అనుకుంటా' అని నవ్వుతూ జవాబు ఇచ్చాడు. దీంతో అందరూ టక్కున నవ్వేశారు.