మంగళవారం, 7 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. గుసగుసలు
Written By సెల్వి
Last Updated : శనివారం, 5 మార్చి 2022 (16:17 IST)

పెళ్లి పీటలెక్కనున్న ప్రభాస్..

టాలీవుడ్‌లో ప్రస్తుతం మోస్ట్ ఎలిజబుల్ బ్యాచ్‌లర్ ప్రభాస్ త్వరలో పెళ్లి పీటలెక్కనున్నాడు. ప్రభాస్ పెళ్లి చేసుకోబోయే అమ్మాయి ఖరారైంది. కృష్ణంరాజు వారసుడిగా తెరంగేట్రం చేసినా ప్రభాస్ టాలీవుడ్‌లో తనదైన ముద్ర వేశాడు. ఈశ్వర్, వర్షం, ఛత్రపతి, బుజ్జి, మిర్చి లాంటి సినిమాలతో హీరోగా ప్రూవ్ చేసుకున్న ప్రభాస్ ఆ తర్వాత ప్యాన్ ఇండియా హీరోగా మారాడు. 
 
బాహుబలి, సాహో, రాధేశ్యామ్, సలార్ లాంటి సినిమాలతో తన మార్కెట్‌ను పెంచుకున్నాడు. ప్రభాస్ నటించిన రాధేశ్యామ్ మూవీ త్వరలోనే ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది
 
ఈ నేపథ్యంలో ప్రభాస్ పెళ్లి గురించి టాలీవుడ్‌లో చర్చ సాగుతోంది. ఈ నేపథ్యంలో ఓ ఇంట్రస్టింగ్ న్యూస్ వెలుగులోకి వచ్చింది. అది పెద్దలు కుదిర్చిన వివాహమని టాలీవుడ్ టాక్. ప్రభాస్‌, హీరోయిన్ అనుష్క శెట్టిలు ప్రేమించుకుంటున్నారని, భవిష్యత్తులో పెళ్లి చేసుకోబోతున్నారని గాసిప్స్ వచ్చాయి. 
 
అయితే ప్రభాస్ ఫ్యామిలీకి దగ్గర ఉన్న ఓ హీరో భార్య రియాక్ట్ అవుతూ.. "ప్రభాస్ తన కుటుంబ సభ్యులకు వ్యతిరేకంగా నిర్ణయాలు తీసుకోరు. అతను పూర్తి ఫ్యామిలీ మ్యాన్. తన తల్లి, పెద్దలు కుదుర్చిన అమ్మాయినే పెళ్లి చేసుకుంటాడు" అని అంటోంది.