సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By సెల్వి
Last Updated : మంగళవారం, 8 మార్చి 2022 (10:38 IST)

ఒక్కరినే పెళ్లాడిన ముగ్గురు అక్కాచెల్లెళ్లు.. ప్రపోజ్ చేస్తే కాదనలేక?

Man Marriage 3 Sisters
ముగ్గురు అక్కాచెల్లెళ్లు ఒకే వ్యక్తిని పెళ్లాడారు. ఆ ముగ్గురు కవలలైన అక్కాచెల్లెళ్లు కావడం గమనార్హం. ఈ ఘటన కాంగోలో చోటుచేసుకుంది. అక్కడ బహుభార్యత్వం అమలులో ఉంది. 
 
వివరాల్లోకి వెళితే ఈస్ట్‌ కాంగోకి చెందిన 32 ఏళ్ల లువిజో అనే వ్యక్తి ఒకేసారి నడేగే, నటాషా, నటాలీ అనే ముగ్గురు యువతులను వివాహం చేసుకున్నాడు.
 
ఈ విషయమై లువిజో మాట్లాడుతూ.. తాను ముందుగా నటాలీతో ప్రేమలో పడ్డానని చెప్పాడు. అనంతరం తనకు ముగ్గురు అక్క చెల్లెళ్లు కలిసి ప్రపోజ్‌ చేశారని.. వారి ప్రేమను తాను తిరస్కరించలేకపోయినట్టు చెప్పాడు. అందుకనే తాను వారందరినీ వివాహం చేసుకోవలసివచ్చిందని అన్నాడు.