సంబంధిత వార్తలు
- 'లవ్ స్టోరీ' దర్శకుడు చేతుల మీదుగా 'వస్తున్నా.. వచ్చేస్తున్నా' ఫస్ట్ లుక్
- కుమార్తె ఆ పని చేసిందనీ.. 8 మందిని సజీవదహనం చేసిన తండ్రి
- ప్రియాంకా గాంధీ అంటే రాహుల్‌కి భయం.. ప్రశాంత్ కిషోర్
- అక్రమ సంబంధానికి అడ్డుగా ఉన్నాడనీ.. భర్తను కడతేర్చిన భార్య
- ప్రేమ పెళ్లి పెటాకులైంది.. నవవధువు ఫ్యానుకు ఉరేసుకుని ఆత్మహత్య
బిగ్ బాస్ 5.. ప్రియాంక, మానస్ లవ్ ట్రాక్.. అన్నం కలిపి తినిపించాడు..
బిగ్ బాస్ 5 ఏడవ వారం షో ఆసక్తికరంగా ఉంది. హౌజ్ మేట్స్ మధ్య అలకలు, గొడవలు, శత్రుత్వం పెరిగి పోతున్నాయి. అయితే ప్రియాంక, మానస్ ల మధ్య మాత్రం రోజురోజుకూ లవ్ ట్రాక్ ఇంట్రెస్టింగ్ గా మారుతోంది. ప్రియాంక ఓపెన్ గానే మానస్ పై ప్రేమను చూపిస్తోంది. కానీ మానస్ మాత్రం తనకేమీ తెలియదు అన్నట్లుగానే వ్యవహరిస్తున్నాడు. దీంతో మానస్ తనను పట్టించుకోవట్లేదంటూ బాధ పడుతోంది.
మొన్న నామినేషన్స్ టాస్క్ లో సన్నీ ప్రవర్తనతో బాధ పడిన ప్రియాంక. మానస్ తనకు ఫ్రెండ్ కదా, ఆయనైనా చెప్పొచ్చు కదా అంటూ కన్నీళ్లు పెట్టుకుంది. ఆ కన్నీళ్ళ పర్వం నిన్న కూడా కొనసాగింది. ఆమె అలక పాన్పు ఎక్కేసరికి మానస్ కూల్ చేసే ప్రయత్నం చేశాడు. ప్రియాంక తినలేదని తెలిసి తానే అన్నం కలిపి స్వయంగా తన చేతులతో తినిపించాడు. దీంతో ప్రియాంక కూల్ అయ్యింది.
ప్రస్తుతం హౌజ్ లో గేమ్ చక్కగా ఆడుతున్న ప్రియాంక గతంలో చాలా సమస్యలను ఎదుర్కొన్నట్టు కొన్ని సందర్భాల్లో వెల్లడించింది. కానీ ఇప్పుడు ఆమె మానస్ చుట్టూ తిరుగుతోంది. మానస్ అందరికి ఆహారాన్ని చక్కగా తినిపిస్తున్నాడని, అయితే తనను పట్టించుకోలేదని ప్రియాంక ఇతర హౌజ్ మేట్స్ దగ్గర వాపోతోంది. ఆయన అలా చేయడాన్ని తాను తీసుకోలేకపోతున్నానని కూడా చెప్పింది. మరోవైపు మానస్ కు మాత్రం ప్రియాంక పై ఎలాంటి ఆసక్తి లేదని స్పష్టంగా కన్పిస్తోంది. మరి రానున్న రోజుల్లో వీరి లవ్ ట్రాక్ ఎక్కడికి చేరుకుంటుందో చూడాలి.
తర్వాతి కథనం
