1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
  4. New married woman attempt suicide

ప్రేమ పెళ్లి పెటాకులైంది.. నవవధువు ఫ్యానుకు ఉరేసుకుని ఆత్మహత్య

Marriage
ప్రేమ విఫలమైంది. ప్రేమ పెళ్లి పెటాకులైంది. వివాహం చేసుకుని రెండు నెలల కూడా నిండకముందే వారి ప్రేమలో విషాదం అలముకుంది. ప్రేమికుడిని వివాహం చేసుకున్న నవవధువు ఫ్యానుకు ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. ఖమ్మం జిల్లాలో చోటుచేసుకున్న ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. 
 
వివరాల్లోకి వెళితే.. గుదిమళ్ల పంచాయతీ పరిధిలోని నంద్యా తండాలో ఈ విషాదం చోటుచేసుకుంది. ఈ తండాకు చెందిన ధరావత్ శైలజా, అదే గ్రామానికి చెందిన యువకుడు కొంతకాలం ప్రేమించుకున్నారు. పెళ్లి చేసుకోవడానికి ఓ పోరాటమే చేశారు. ఇరువైపులా పెద్దలను ఒప్పించి మరీ పెళ్లుచేసుకున్నారు. ఆగస్టు నెలలోనే వీరిద్దరు ఒక్కటయ్యారు.
 
దురదృష్టకరమేమిటంటే, పెళ్లి జరిగిన తర్వాత వారి మధ్య చిన్నచిన్న గొడవలు ప్రారంభమయ్యాయి. ఈ గొడవలపై శైలజా తరుచూ బాధపడేది. వీటి వల్లే ఆమె తీవ్ర మనస్తాపం చెంది తాను ప్రాణాలు తీసుకోవాలనే నిర్ణయానికి వచ్చినట్టు తెలుస్తుంది. 
 
బుధవారం రోజు రాత్రి ఇంట్లో అందరూ గాఢ నిద్రలోనే ఉన్నప్పుడు ఆత్మహత్యకు పాల్పడింది. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు జరుపుతున్నారు.
About Writer
సెల్వి
తర్వాతి కథనం
దేశంలో మళ్లీ పెరిగిన కరోనా కేసులు