శుక్రవారం, 21 జూన్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By ఠాగూర్
Last Updated : బుధవారం, 13 అక్టోబరు 2021 (14:22 IST)

మహిళా కార్పొరేటర్ భర్తను చెప్పుతో కొట్టిన మహిళ

తెలంగాణా రాష్ట్రంలోని నిజామాబాద్ జిల్లాలో ఓ మహిళా కార్పొరేటర్‌ భర్తను మరో మహిళ చెప్పుతో కొట్టింది. నగరంలోని 40వ డివిజన్‌కు చెందిన కార్పొరేటర్‌ భర్త తమ కూతురిని మోసం చేశాడంటూ ఆరోపించిన ఆ మహిళ బుధవారం కార్పొరేటర్‌ ఇంటికి వెళ్లి ఆందోళనకు దిగింది. 
 
ఈ సందర్భంగా తమ కుమార్తెకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. దీంతో కార్పొరేటర్‌ భర్త.. బాధిత మహిళ తల్లిదండ్రులకు మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. ఈ క్రమంలోనే కార్పొరేటర్‌ భర్తను బాధితురాలి తల్లి చెప్పుతో కొట్టింది.