శుక్రవారం, 21 జూన్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By సెల్వి
Last Updated : గురువారం, 14 అక్టోబరు 2021 (15:21 IST)

హిమాయ‌త్‌సాగ‌ర్‌లో మహిళపై సామూహిక అత్యాచారం..

మహిళలపై అకృత్యాలు పెచ్చరిల్లిపోతూనే వున్నాయి. వయోబేధాలు లేకుండా ఎక్కడపడితే అక్కడ అత్యాచారాలు చోటుచేసుకుంటున్నాయి. తాజాగా హైదరాబాద్, రాజేంద్ర‌న‌గ‌ర్ పోలీసు స్టేష‌న్ ప‌రిధిలోని హిమాయ‌త్‌సాగ‌ర్‌లో బుధ‌వారం రాత్రి దారుణం జ‌రిగింది. 
 
పోలీసు అకాడ‌మీ వ‌ద్ద వేచి ఉన్న ఓ మ‌హిళ‌ను ఆటోలో వ‌చ్చిన ముగ్గురు వ్య‌క్తులు కిడ్నాప్ చేశారు. అనంత‌రం ఆమెను హిమాయ‌త్ సాగ‌ర్‌కు సమీపంలో నిర్మానుష్య ప్ర‌దేశానికి తీసుకెళ్లి సామూహిక అత్యాచారం చేశారు. ఆ త‌ర్వాత మ‌హిళ వ‌ద్ద ఉన్న న‌గ‌దు, బంగారు ఆభ‌ర‌ణాల‌ను దొంగిలించి రోడ్డుపైన వ‌దిలేసి వెళ్లిపోయారు. 
 
ఈ ఘటనపై బాధితురాలు రాజేంద్ర‌న‌గ‌ర్ పోలీసుల‌కు ఫిర్యాదు చేసింది. కేసు న‌మోదు చేసుకున్న పోలీసులు ద‌ర్యాప్తు చేప‌ట్టారు. పోలీసు అకాడ‌మీ నుంచి హిమాయ‌త్ సాగ‌ర్ వ‌ర‌కు ఉన్న సీసీటీవీ ఫుటేజీల‌ను పోలీసులు ప‌రిశీలిస్తున్నారు.