1. వార్తలు
  2. బిజినెస్
  3. వార్తలు
Written By ఠాగూర్
Last Updated : బుధవారం, 13 అక్టోబరు 2021 (09:50 IST)

పండగ వేళ పెరుగుతున్న బంగారం ధరలు

పండగ వేళ బంగారం ధరలు మరింతగా పెరిగిపోతున్నాయి. గ‌త కొన్ని రోజులుగా పెరుగుతూ, తగ్గుతూ వ‌చ్చిన బంగారం ధ‌ర‌ల్లో బుధవారం మార్పులున్నాయి. రెండు, మూడు రోజుల నుంచి ఉపశమనం కలిగించిన ధరలు ఈ రోజు పెరిగాయి. బుధవారం కూడా ఎగబాకాయి. 
 
కొన్ని కొన్ని ప్రాంతాల్లో స్వల్పంగా పెరిగితే మరి కొన్ని ప్రాంతాల్లో ఎక్కువగా పెరిగింది. అంతర్జాతీయంగా చోటుచేసుకున్న పరిస్థితుల ఆధారంగా బంగారం ధరలో హెచ్చుతగ్గులు ఉంటాయి. తాజాగా దేశీయంగా ప్రధాన నగరాల్లో బంగారం ధరలు ఇలా ఉన్నాయి.
 
ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.46, 300 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.50,510 ఉంది. చెన్నైలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.44,300 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.48,320 ఉంది. ముంబైలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.46,030 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.47,030 వద్ద కొనసాగుతోంది. 
 
హైదరాబాద్‌లో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.44,150 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.48,160 ఉంది. విజయవాడలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.44,150 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.48,160 ఉంది. విశాఖలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.44,150 ఉండగా, 24 క్యారెట్ల ధర రూ.48,160 ఉంది.