గురువారం, 19 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. బిజినెస్
  3. వార్తలు
Written By సెల్వి
Last Updated : మంగళవారం, 12 అక్టోబరు 2021 (11:53 IST)

దిగొచ్చిన బంగారం, వెండి ధరలు

రెండు రోజులుగా స్వల్పంగా తగ్గుతూ వచ్చిన బంగారం ధర మంగళవారం అక్టోబరు 12 స్థిరంగా కొనసాగుతోంది. వెండిధరలు మాత్రం స్వల్పంగా దిగొచ్చాయి. ప్రధాన నగరాల్లో ఉదయం ఆరు గంటల వరకూ బంగారం, వెండి ధరలు ఇలా వున్నాయి. 
 
బంగారం, వెండి ధరల్లో ప్రతిరోజు అనేక మార్పు చేసుకుంటుండటం అనేది ప్రపంచవ్యాప్తంగా అనేక రకాల అంశాలపై ఆధారపడి ఉంటుంది. అంతర్జాతీయ మార్కెట్‌లో ధరలు మార్పులు కావడం కూడా ఓ కారణం. అయితే, ఇలా గ్లోబల్ మార్కెట్‌లో ధరలు హెచ్చు తగ్గులు కావడానికి కూడా అనేక అంతర్జాతీయ పరమైన కారణాలు ఉంటాయి. 
 
ప్రధాన నగరాల్లో బంగారం ధరలు
హైదరాబాద్‌లో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.43,900,24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.47,890
విజయవాడలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.43,900, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.47,890
విశాఖలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.43,900 , 24 క్యారెట్ల ధర రూ.47,890
 
ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.46,060 , 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.50,260
చెన్నైలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.44,190, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.48,060 
ముంబైలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.45,940, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.46,940