1. వార్తలు
  2. బిజినెస్
  3. వార్తలు
Written By సెల్వి
Last Updated : ఆదివారం, 10 అక్టోబరు 2021 (09:52 IST)

రికార్డు స్థాయికి చేరుకున్న పెట్రో ధరలు

దేశంలో చమురు ధరలు తగ్గుముఖం పట్టడం లేదు. వీటి ధరల ఎఫెక్ట్ ఇతర వాటిపై పడుతున్నాయి. నిత్యావసర సరుకుల ధరలు మండిపోతున్నాయి. తాజాగా.. మరోసారి పెట్రో ధరలు రికార్డు స్థాయికి చేరుకున్నాయి. అంతర్జాతీయంగా ముడి చమురు ధరలు తగ్గినా…దేశీయ పెట్రోలియం కంపెనీలు మాత్రం… వరుసగా పెట్రోల్, డీజిల్ ధరలు పెంచుతూ వస్తున్నాయి.
 
డీజిల్ ధర కూడా సెంచరీ దాటడంతో సామాన్యుడు కన్నీళ్లు పెట్టుకుంటున్నాడు. లీటరు పెట్రోల్ పై 30 పైసలు, డీజిల్ పై 35 పైసలు పెంచడంతో రికార్డు స్థాయికి చేరినట్లైంది. దీంతో చాలా ప్రాంతాల్లో లీటర్ పెట్రోల్ ధర సెంచరీ దాటింది. దేశ రాజధాని ఢిల్లీలో లీటర్ పెట్రోల్ రూ. 104.14, డీజిల్ రూ. 92.82 కి చేరుకుంది. హైదరాబాద్‌లో లీటర్ పెట్రోల్ రూ. 108.33,డీజిల్ రూ. 101.27గా ఉంది.
 
మిగిలిన నగరాల్లో.. 
న్యూఢిల్లీ లీటర్ పెట్రోల్ రూ. 104.14. లీటర్ డీజిల్ రూ. 92.82
కోల్ కతా లీటర్ పెట్రోల్ రూ. 104.77. లీటర్ డీజిల్ రూ.95.93
ముంబై లీటర్ పెట్రోల్ రూ. 110.12. లీటర్ డీజిల్ రూ. 100.66
చెన్నై లీటర్ పెట్రోల్ రూ. 101.53 లీటర్ డీజిల్ రూ. 97.26