శనివారం, 8 ఫిబ్రవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By సెల్వి
Last Updated : మంగళవారం, 12 అక్టోబరు 2021 (12:31 IST)

గుండెపోటుతో మ‌హేశ్ కోనేరు మృతి

Mahesh Koneru
ప్రముఖ సినీ నిర్మాత‌, పీఆర్ఓ మ‌హేశ్ కోనేరు గుండెపోటుతో మంగళవారం క‌న్నుమూశారు. క‌ళ్యాణ్ రామ్‌, స‌త్య‌దేవ్‌తో ప‌లు సినిమాలు నిర్మించిన మ‌హేష్ కోనేరు సినీ పరిశ్ర‌మ‌కు చెందిన పలువురు హీరోల‌కు పీఆర్ఓగా వ్యవహరించారు.

118, తిమ్మ‌ర‌సు, మిస్ ఇండియా సినిమాలను మహేశ్ నిర్మించారు. మహేశ్ మృతిపై యంగ్ టైగర్ ఎన్టీఆర్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. 
 
మహేశ్ తనకు ఆత్మ మిత్రుడని, ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ఎన్టీఆర్ దేవుడిని ప్రార్థించారు. మహేశ్ మృతిపై ఎన్టీఆర్ సంతాపం వ్యక్తం చేయడంతో పాటు ఆయన కుటుంబానికి సానుభూతి తెలిపారు.