శుక్రవారం, 8 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By జెఎస్కే
Last Modified: విజ‌య‌వాడ‌ , శనివారం, 9 అక్టోబరు 2021 (18:39 IST)

మ‌ధురాన‌గ‌ర్ రైల్వే స్టేష‌న్లో కృష్ణదేవరాయ యూత్ ఆర్గనైజేషన్ క్లీన్ ఇండియా

ఎవ‌రికీ ప‌ట్ట‌ని ప్రాంతాలుగా రైల్వే స్టేష‌న్లు మారిపోతున్న త‌రుణంలో యువ‌త న‌డుం బిగించింది. రైల్వే స్టేష‌న్ లో ప‌ట్టాల‌పై చెత్త చెదారాన్నిక్లీన్ చేసింది. కేంద్ర యువజన వ్యవహారాలు, క్రీడా మంత్రిత్వ శాఖ నెహ్రూ యువ కేంద్ర విజయవాడ ఆధ్వ‌ర్యంలో శ‌నివారం విజయవాడ మదురానగర్ రైల్వే స్టేషన్ లో  క్లీన్ ఇండియా నిర్వ‌హించారు. కృష్ణదేవరాయ యూత్ ఆర్గనైజేషన్ స్కై బీమాల వినోద్ కుమార్ ఆద్వర్యంలో, వాయుపుత్ర యూత్ క్లబ్, కొమరపురి గొపాల్  వెంకి యూత్ క్లబ్, అభినేష్ లను కలుపుకొని క్లీన్ ఇండియా చేప‌ట్టారు. 
 
ప్లాస్టిక్ నిర్మూలనలో భాగాంగా 450 కేజీల ప్లాస్టిక్ వ్యర్థాలను పొగు చేశారు. వాటిని రైల్వే స్టేషన్ గార్బేజ్ ఏరియాలో డంప్ చేశారు. ఈ కార్యక్రమంలో నెహ్రూ యువ  కేంద్రం విజయవాడ  యూత్ ఆఫీసర్ సుంకర రాము, పాల్గొని ప్లాస్టిక్ వ్యర్థాలను తొలగించి ట్రాక్స్ ని పరిశుభ్రంగా ఉంచి. రైల్ వే పరిశుభ్రతను  కాపాడాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమానికి రైల్వే స్టేషన్ మాస్టార్ మరియదాస్ ఎంతగానో సహకరించి సిబ్బందిని ఇన్వాల్మెంట్ అయ్యేలా చేశారు. నెహ్రూ యువ కేంద్రం వాలంటీర్లు గోపాల్, అభినేష్, మల్లీశ్వరి, హరిజనవాడ యూత్ క్లబ్ , యమ్ శివ, కె కృష్ణ   స్టేషన్ హౌస్ కీపింగ్ వర్కర్స్ పాల్గొన్నారు.