గురువారం, 28 సెప్టెంబరు 2023
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By జెఎస్కే
Last Modified: విజ‌య‌వాడ‌ , శుక్రవారం, 8 అక్టోబరు 2021 (11:33 IST)

బెజ‌వాడ క‌న‌క‌దుర్గ‌మ్మ‌ను ద‌ర్శించుకున్న సినీ న‌టి శ్రీయ‌

ప్ర‌ముఖ సినీ న‌టి శ్రీయ‌కు దైవ భ‌క్తి చాలా ఎక్కువ‌. అందుకే ఆమె త‌ర‌చూ తీర్థ‌యాత్ర‌ల‌కు, పుణ్య క్షేత్రాల‌కు వ‌స్తుంటారు. తిరుమ‌ల తిరుప‌తికి ఇటీవ‌ల త‌న భ‌ర్త‌తో స‌హా విచ్చేసిన శ్రీయ అక్క‌డి మీడియాకు జంట‌గా ఫోజులు ఇచ్చిన విష‌యం తెలిసిందే. ఇది జ‌రిగి నెల తిర‌గ‌క ముందే శ్రీయ ఇపుడు బెజ‌వాడ‌లో ద‌ర్శ‌న‌మిచ్చారు. 
 
శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా శుక్రవారం శ్రీ బాలాత్రిపుర సుందరీ దేవి అలంకారంలో వున్న అమ్మవారిని కుటుంబ సభ్యులతో కలిసి సినీనటి శ్రీయ దర్శించుకున్నారు. ఆమెకు ఆల‌యంలో దేవాదాయ‌శాఖ సిబ్బంది స‌హ‌క‌రించి, ద‌ర్శ‌నం క‌ల్పించి... వేద పండితుల‌తో ఆశీర్వాదం ఇప్పించారు. గ‌తంలో మాదిరిగా సినీనటి శ్రీయ ఆల‌యంలో ఫోజులు ఇవ్వ‌కుండా, మీడియాకు ఫోటోలు కూడా వ‌ద్ద‌ని వారించారు. మాస్క్ తీయాల‌ని ఫోటోగ్రాఫ‌ర్లు అభ్య‌ర్థించ‌గా, కోవిడ్ నిబంధ‌న‌లు అంటూ...ఆమె మాస్క్ కూడా తీయ‌లేదు. అమ్మ‌వారి ద‌ర్శ‌నం త‌న‌కు ఎంతో శ‌క్తినిచ్చింద‌ని శ్రీయ క‌న‌క‌దుర్గ‌మ్మ‌ను భ‌క్తితో పూజించారు.