మంగళవారం, 7 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By సెల్వి
Last Updated : సోమవారం, 11 అక్టోబరు 2021 (17:20 IST)

బిగ్ బాస్ ప్రోమోలో ఇంటి సభ్యుల మధ్య మాటల యుద్ధం

బిగ్ బాస్ సీజన్ 5 తెలుగు సండే ఎపిసోడ్ సరదాగా సాగిన.. సోమవారం ఎపిసోడ్ మాత్రం ఈ వారం నామినేషన్ల ప్రక్రియతో ఇంటి సభ్యులకు అగ్నిపరీక్షగా మారనుంది. తాజాగా విడుదలైన బిగ్ బాస్ ప్రోమోలో ఇంటి సభ్యుల మధ్య మరోసారి మాటల యుద్ధం మొదలైనట్టుగా తెలుస్తుంది. నామినేట్ చేయవలసిన ఇంటి సభ్యుడి ఫోటోని మంటల్లో వేసి ఎందుకు నామినేట్ చేశారో కారణం చెప్పాల్సి ఉంటుంది.
 
అందులో భాగంగా విజే సన్నీ.. జెస్సిని నామినేట్ చేయడం చూడవచ్చు. అయితే కెప్టెన్సీ టాస్క్ సమయంలో జెస్సీ సన్నీని నీకు ఆట ఆడటం రాదు అని చేసిన కామెంట్ కి సన్నీ జెస్సిని నామినేట్ చేయడమే కాకుండా నేను ఆట ఆడితే తట్టుకోలేవంటూ సన్నీ ఫైర్ అవుతాడు.
 
ఇక ప్రియ, యానీ మాస్టర్ ఇద్దరు విశ్వాని, సిరి హనుమంత్ శ్రీరామచంద్రతో పాటు శ్వేతవర్మని నామినేట్ చేయనుంది. యాంకర్ రవి.. మానస్ ని, ప్రియాంక సింగ్ లోబోని తిడుతూ నామినేట్ చేస్తూ సోమవారం ఎపిసోడ్ ని నామినేషన్ల ప్రక్రియతో ఇంటి సభ్యులు హీట్ పుట్టించారు.