ఆదివారం, 1 అక్టోబరు 2023
  1. ఇతరాలు
  2. ప్రేమాయణం
  3. వాలెంటైన్స్ డే
Written By ఐవీఆర్
Last Updated : మంగళవారం, 8 ఫిబ్రవరి 2022 (22:54 IST)

మల్లికా... ఏదీ నీ చేయీ.... ప్రపోజ్ డే ఏమైంది?

మనసుకు నచ్చిన అమ్మాయి. ఆమె చూపుల్లో తెలియని మరో లోకపు అందం. ఆమె కనురెప్పల చప్పుడికి అతడి హృదయం ప్రేమ సరాగాలు మీటుతుంది. కానీ తనలోని ప్రేమను ఎలా చెప్పేది? ఒక్కసారి మల్లికవైపు చూసాడు. తల వంచుకుని పుస్తకంలో ఏదో రాస్తుంది.

 
అవడానికి మామ కూతురు అయినా ఆమెతో మనసులో వున్నది చెప్పాలంటే గుండె గుభేలే. ఏమంటుందోనని భయం. ఎన్నో రోజులుగా వాళ్ల ఇంటికి వస్తున్న అమ్మాయే. కానీ ఈ రోజు ఏమిటో సమ్‌థింగ్ స్పెషల్. బహుశా ప్రేమంటే ఇదేనేమో. ఏదేమైనా ఆమెకి తన మనసులోని మాటను చెప్పాలని ధైర్యంగా కాస్త ముందుకి ఒంగాడు.

 
మరి ఆమెకి సిక్త్స్ సెన్స్ వుందో ఏమోగానీ ఒక్కసారిగా చివాల్న తలపైకెత్తి చూసింది. దెబ్బకి చమట్లు పట్టేసాయి. కానీ ఆమె చూపులు గుండెల్లో గుచ్చేసాయి. మళ్లీ తను తల వంచుకుని పుస్తకం చదువుతోంది. ఇక లాభంలేదని... మెల్లగా తలపై ముద్దు పెట్టబోయాడు. మళ్లీ అదే చూపు. వార్నయనోయ్... ప్రేమ తెలిపేది ఎలా?

 
ఇంతలో ఇక నేను వెళ్లొస్తానని బై చెప్పేసింది. ఆమె గడప దాటి కాలు పెట్టింది. తన గుండెను తనతో లాక్కెళ్లిపోతుందనే ఫీలింగ్. ఏం చేయాలి? బయటకు వెళ్లిన ఆమె కోసం కిటికీ వద్ద ఎదురుచూస్తూ నిలబడ్డాడు. ఆమె అలా రాగానే.. మల్లికా... ఏదీ నీ చేయి అన్నాడు. కొద్దిసేపు అలా చూసి.. ఎడమ చేతిని కిటికీ లోపలకి పెట్టింది. అంతే.. ఎక్కడ నుంచి వచ్చిందో ధైర్యం... 

 
చటుక్కున ముద్దు పెట్టేసి ఐ లవ్ యు అని చెప్పాడు. అలా తన లవ్ ప్రపోజ్ చెప్పేసాడు.