బుధవారం, 8 జనవరి 2025
  1. ఇతరాలు
  2. ప్రేమాయణం
  3. వాలెంటైన్స్ డే
Written By ఐవీఆర్
Last Modified: సోమవారం, 7 ఫిబ్రవరి 2022 (09:48 IST)

కమనీయమా కలువ రేకుల నయనతరంగమా

కమనీయమా
కలువ రేకుల నయనతరంగమా
మల్లెల పరిమళమా
మన్మథ సామ్రాజ్ఞి దేవీ సుగంధమా

 
వెన్నెల రేకుల వెలుగుల దీపమా
వెండికొండల అందాల ద్వీపమా
కొండగట్టుపై వీచే చిరుగాలి సరాగమా
కొంగు చాటున దాచుకున్న అందమా

 
నాకై భువికేగిన ప్రియామృతమా
నా అణువణువులో ఇంకిపోయే రసామృతమా
మధుమాసం మాఘమాసం
మదీయ చెలీ నీకిదే స్వాగతం