బుధవారం, 22 జనవరి 2025
  1. ఇతరాలు
  2. ప్రేమాయణం
  3. వాలెంటైన్స్ డే
Written By ఐవీఆర్
Last Modified: ఆదివారం, 14 ఫిబ్రవరి 2021 (00:01 IST)

ప్రేమకై నాకు మరుజన్మంటూ వుంటే నీకోసమే పుడతానే

ప్రేయసివై నా దరికి చేరావే
ప్రేమించే మనసంటే నీదేనని చెప్పావే
ప్రేమిక అంటే నీలా వుండాలని చూపావే
ప్రేమించే అందమైన హృదయం నీదేనే
 
ప్రేమలోకంలో నీతో నాకు రమణీయమే
ప్రేమంటి నీ తీయని మనసుతో దోచావే
ప్రేమ లోతుల్లో అమృతాన్ని పంచావే
ప్రేమతో నాకు దగ్గరై నను మురిపించావే
 
ప్రేమే నా శ్వాసగా నీ శ్వాసలో కలుపుకున్నావే
ప్రేమనే నా గుండెచప్పుళ్లను నీ గుండెతో ఏకం చేసావే
ప్రేమతో నీ తనువు నా తనువుకి అప్పగించావే
ప్రేమకై నాకు మరుజన్మంటూ వుంటే నీకోసమే పుడతానే