సంబంధిత వార్తలు
- ట్విట్టర్ సంస్థకు మహిమా కౌల్ రాజీనామా.. కారణం రైతు ఉద్యమమా?
- ట్రెండ్ అయిన హ్యాష్‌ట్యాగ్.. భారతరత్న ప్రచారాన్ని ఆపండి ప్లీజ్
- ట్రెండింగ్‌లో నితిన్ చెక్.. ప్రియా ప్రకాష్ వారియర్, రకుల్ హీరోయిన్లుగా?
- కేటీఆర్ తెలంగాణ సీఎం అవుతారా? ఫిబ్రవరి 18న పట్టాభిషేకం..?
- #Trending ప్రభాస్.. యష్.. కాంబినేషన్.. సలార్.. కాంబో అదుర్స్
వాలెంటైన్ వీక్.. చాక్లెట్ డే రోజున ఇలా ప్రపోజ్ చేస్తే..?
Chocolate Day
మీ ప్రియమైన వారి పట్ల మీలో ఉన్న భావాలను చెప్పడానికి ఈ చాక్లెట్ డేను సరైన సమయంగా ఉపయోగించుకోవచ్చు. వాలెంటైన్ వీక్‌లో మూడవ రోజు అంటే ఫిబ్రవరి 9న చాక్లెట్ డేగా జరుపుకుంటారు ప్రేమికులు. ఈ రోజున రకారకాల చాక్లెట్లను ఇచ్చి తమవారి పట్ల ఎంత ప్రేమ ఉందో తెలియజేస్తుంటారు. ఆల్రెడీ ప్రేమలో ఉన్నవారు తమవారికి ఇష్టమైన చాక్లెట్లను ఇచ్చి వారిని సంతోషపెడుతుంటారు.
సాధారణంగా వాలంటైన్స్ డే వస్తుందంటే రకరకాల ప్రేమ చాక్లెట్స్ మార్కెట్లోకి అందుబాటులోకి వస్తాయి. వాటిలో రకరకాల డార్క్ చాకోలెట్లను ఎంచుకొని మీ ఆత్మీయులకు అందివ్వండి. ఆరోగ్యం ప్రకారం చూస్తే, డార్క్ చాక్లెట్ బరువు తగ్గడానికి మంచిదిగా చెప్పబడుతుంది.
అవేకాకుండా మానసిక సమస్యలతో డిప్రెషన్ బారిన పడేవారికి కూడా డార్క్ చాక్లెట్ ఉపశమనాన్ని అందిస్తుంది. ఈ డార్క్ చాక్లెట్లలో కోకో ఎక్కువగా, పాలపదార్ధాలు తక్కువగా ఉంటాయి. క్రమంగా.. ఇందులో ఉండే కోకో ఆధారంగా డార్క్ చాక్లెట్ రుచి మారుతుంది.
"చాలా షాప్స్ తిరిగాను నీకంటూ ప్రత్యేకమైన చాక్లెట్ ఇవ్వడానికని.. కానీ నేను కనుగోనలేకపోయాను నీ నవ్వు కంటే తియ్యనైనా చాక్లెట్ ఎక్కడ ఉంటుందని.. హ్యాప్పీ చాక్లెట్ డే స్వీట్ హార్ట్.." అంటూ చాక్లెట్ డే రోజున ప్రపోజ్ చేస్తే.. ప్రియురాలు మీ ప్రేమను తప్పకుండా అంగీకరిస్తుంది.
