1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. గుసగుసలు
Written By డీవీ
Last Updated : బుధవారం, 9 జూన్ 2021 (22:16 IST)

సురేఖ‌వాణి అందుకు గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చేసిందా! (video)

Surekha vani
న‌టి సురేఖా వాణి సోష‌ల్ మీడియా వారికి ప‌రిచ‌య‌మే. ఆమె త‌న ఆలోచ‌న‌ల‌ను ఎప్ప‌టిక‌ప్పుడు షేర్ చేసుకుంటుంది. కొంద‌రు పాజిటివ్‌గా రెస్సాన్స్ అయితే మ‌రికొంద‌రు డైరెక్ట్ ఎటాక్‌లా మాట్లాడేస్తుంటారు. ముఖ్యంగా యూత్‌ను టార్గెట్ చేస్తూ, ఆ మ‌ద్య వాలెంటైన్ డే నాడు `హ్యాపీ హ్యాపీ వాలెంటైన్స్ డే అబ్బాయిలు ఎల్లప్పుడూ హపిగా వుండండి. జీవితం చిన్నది మన జీవితంలో ప్రతి నిమిషం ఆనందించండి` అంటూ పోస్ట్ చేస్తే అనూహ్య స్పంద‌న వ‌చ్చింది. ఇలా ఏదో ర‌కంగా ఫొటోలు షేర్ చేస్తూ కామెంట్లు పెడుతుంది. అందుకే ఈమె మ‌ర‌లా రెండో వివాహం చేసుకోబోతుంద‌ని వార్త కూడా వ‌చ్చింది. దానికి ఆమె ఖండించింది.
 
కానీ ఇటీవ‌లే ఆమె ఓ చిత్ర‌మైన పోస్ట్ పెట్టింది. ప్రేమకు వయసుతో పని లేదు అంటూ ఆమె వయస్సు అనేది ప్రేమలో ఒక నెంబర్ మాత్రమే అని చెప్పుకొచ్చింది. పైగా ఈ విషయం గురించి ఉద్దేశిస్తూ తమ కంటే తక్కువ వయసున్న అబ్బాయిలను వివాహం చేసుకుంటున్న నలుగురు జంటల గురించి ప్ర‌స్తావించింది. అందులో బాలీవుడ్ నటి ప్రియాంక చోప్రా, నిక్ జోనన్‌, మ‌రో హాలీవుడ్ జంట కూడా ఉన్నారు. దీనిపై పలు అనుమానాలు నెటిజ‌న్ల‌కు వ్యక్తమవుతున్నాయి. మ‌రి కొద్దిరోజుల్లో ఏదైనా ట్విస్ట్ ఇస్తుందేమో చూడాలి.