సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By సెల్వి
Last Updated : గురువారం, 3 జూన్ 2021 (16:35 IST)

నేను రెండో పెళ్లి చేసుకోవట్లేదు.. పూర్తి ఆరోగ్యంతో వున్నాను.. ప్రేమ

prema
తెలుగు, త‌మిళ‌, క‌న్న‌డ‌, మ‌ల‌యాళ చిత్రాల్లో న‌టించి న‌టిగా త‌న‌కంటూ ఓ ప్ర‌త్యేక‌మైన స్థానాన్ని సంపాదించింది ప్రేమ రెండో పెళ్లి చేసుకోబోతున్నట్లు సోషల్ మీడియాలో వార్తలు వైరల్ అవుతున్నాయి. అంతేకాదు ఆమె ప్రస్తుతం అనారోగ్యంతో ఉన్నారని కూడా రూమర్లు వస్తున్నాయి. 
 
అయితే ఈ రూమర్లకు చెక్ పెట్టేందుకు స్వయంగా ప్రేమ రంగంలోకి దిగింది. తన ఆరోగ్యం గురించి, రెండో పెళ్లి గురించి ఓ క్లారిటీ ఇచ్చేసింది. తన మీద వస్తున్న వార్తలను కొట్టిపారేసింది నటి ప్రేమ. ప్రస్తుతం తాను ఒంటరిగానే ఎంతో సంతోషంగా ఉన్నట్లు తెలిపింది. తనకు రెండో పెళ్లి చేసుకునే ఉద్దేశం తనకు లేదని అన్నారు. అలాగే  తాను సంపూర్ణ ఆరోగ్యంగా ఉన్నట్లు పేర్కొన్నారు. సోషల్ మీడియాలో వచ్చే వదంతులను నమ్మవద్దని ఆమె కోరింది. 
 
కాగా 2006లో వ్యాపార‌వేత్త జీవ‌న్ అప్ప‌చ్చుని పెళ్లి చేసుకున్న ప్రేమ మ‌న‌స్ప‌ర్ధ‌ల‌తో 2016లో విడాకులు తీసుకొని ప్రస్తుతం ఒంటరి జీవితం గడుపుతోంది. ప్రేమ కన్నడ, తమిళం, మలయాళంతో పాటు తెలుగు చిత్రాల్లోనూ నటించింది. వెంకటేశ్‌, జగపతి బాబు, రవిచంద్రన్‌, మోహన్‌ బాబు, మోహన్‌లాల్‌, విష్ణువర్ధన్‌, సాయికుమార్‌ వంటి పలువురు అగ్రనటులతో నటించారు.