సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By సెల్వి
Last Updated : బుధవారం, 26 మే 2021 (14:48 IST)

కేరళ నటి శరణ్య శశి ఆరోగ్య పరిస్థితి ఏంటి..? పట్టిపీడిస్తున్న ఆ వ్యాధి..?

Saranya sasi
బుల్లితెరపై ఎన్నో సీరియల్స్‌లో నటించి తనకంటూ మంచి గుర్తింపు తెచ్చుకుంది కేరళ నటి శరణ్య శశి. తెలుగు, మలయాళంలో, తమిళ భాషల్లో పలు సీరియల్స్ లో నటించింది. తెలుగులో 'స్వాతి' అనే సీరియలో నటించి.. తన అందంతో, నటనతో బాగా ఆకట్టుకుంది. ఆ తర్వాత తమిళ, మలయాళ సినీ ఇండస్ట్రీలో అడుగు పెట్టి పలు సినిమాలలో నటించింది. అంతేకాకుండా మలయాళం సీరియల్ లో తన నటనకు అవార్డు కూడా సొంతం చేసుకుంది. ఇదిలా ఉంటే ప్రస్తుతం ఈ ముద్దుగుమ్మ చావు బతుకుల మధ్య పోరాడుతుంది.
 
నటిగా తన జీవితం సాఫీగా సాగుతున్న సమయంలో తను బ్రెయిన్ ట్యూమర్ వ్యాధి కి గురయ్యింది. ఇక అప్పటి నుంచి తను మంచాన పడగా పలు వైద్య చికిత్సలు అందుకుంటూనే ఉంది. ఇప్పటికీ సరైన ఆరోగ్యంతో కోలుకోలేని శరణ్యకు పలు సర్జరీలు కూడా జరిగాయి. ఇప్పటికీ ఆమెకు 11 సర్జరీలు జరుగగా తన ఆరోగ్యం మరింత దిగజారింది. అంతేకాకుండా చావు బతుకుల మధ్య పోరాడుతున్న శరణ్య శశికి.. తనను పట్టిపీడిస్తున్న వ్యాధి వెన్నెముక నుంచి శరీరమంతా పాకుతున్నదని వైద్యులు తెలిపారు.
 
ఇక ఈ విషయాన్ని తనతో పాటు ఉంటున్న మరో నటి సీమా నాయర్ ఈ విషయాలను తన యూట్యూబ్ చానల్ ద్వారా అభిమానులతో పంచుకుంది. ఇదిలా ఉంటే తాను ఈ మధ్య కాస్త ఆరోగ్యం కుదుట పడుతూ కోలుకుంటున్న సమయంలో తన తల్లి, సోదరుడికి కరోనా పాజిటివ్ రావడంతో వారిద్దరు ప్రస్తుతం హాస్పిటల్ లో చికిత్స పొందుతున్నారని తెలిపింది సీమా. దీంతో తన అనారోగ్య సమస్య తీవ్రంగా మారటంతో రోజు రోజుకు తన పరిస్థితి మరింత దారుణంగా మారుతుందని తెలిపింది.