మంగళవారం, 24 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ఐవీఆర్
Last Updated : గురువారం, 20 మే 2021 (12:13 IST)

నీవి సూపర్ అంటూ నటికి అభిమాని బాడీ షేమింగ్

సోషల్ మీడియా వచ్చిన దగ్గర్నుంచి ప్రతి ఒక్కరూ దీన్ని బాగా ఉపయోగించుకుంటున్నారు. సెలబ్రిటీలు అయితే అభిమానులతో ఈ మాధ్యమాల ద్వారా ముచ్చటిస్తున్నారు. కొంతమంది లైవ్ లోకి కూడా వచ్చి మాట్లాడుతున్నారు. ఐతే అలాంటి సమయంలో కొందరు సెలబ్రిటీలపై వెకిలి కామెంట్లు చేస్తూ పైశాచికత్వాన్ని ప్రదర్శిస్తున్నారు.
 
తాజాగా మలయాళ నటి, టీవీ హోస్ట్ అశ్వతి శ్రీకాంత్ తను గర్భవతి అయిన సందర్భంగా కొన్ని ఫోటోలను షేర్ చేసింది. ఈ ఫోటోలను చూసిన చాలామంది ఆమెకి విషెస్ తెలిపారు. ఐతే వారిలో ఒకరు మాత్రం నటిపై బాడీ షేమింగ్ కామెంట్లు చేసాడు. నీ ఎద సౌందర్యం చాలా బాగున్నదంటూ చెప్పలేని పదాలను పెడుతూ కామెంట్ పెట్టాడు. ఈ వ్యాఖ్య చూసిన అశ్వతి శ్రీకాంత్ అతడు నోరెత్తలేని సమాధానం చెప్పింది.
 
అవును. ఈ సమయంలో అంతే. నేను నా బిడ్డకు పాలిచ్చాను. పుట్టబోయే బిడ్డకు కూడా పాలివ్వాలి కదా. అందుకే. మీ అమ్మవి కూడా ఆ సమయంలో నాలాగే సూపర్ గా వుండి వుంటాయి అంటూ రిప్లై ఇచ్చింది. దీనితో అతడు మారుమాట్లాడలేదు. ఆమె ఇచ్చిన రిప్లై చూసిన నెటిజన్స్ అతడికి సరిగ్గా బుద్ధి చెప్పారంటూ ప్రశంసించారు.