బుధవారం, 1 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By సెల్వి
Last Updated : బుధవారం, 12 మే 2021 (20:20 IST)

600 మంది పేదలకు అన్నదానం.. కరోనా దరిద్రం పోవాలి: సంజన

కన్నడ నటి సంజనా కరోనా, లాక్‌డౌన్‌ వల్ల ఇబ్బందుల్లో ఉన్న పేదలకు అండగా నిలిచారు. తన వంతు సాయంగా ప్రతి రోజు కర్ణాటకలోని తన ఇంటి సమీపంలో 600 మంది పేదలకు అన్నదానం చేస్తున్నారు. ఈ విషయాన్ని ఆమె ఓ వీడియో ద్వారా తెలిపారు. 
 
ఈ సందర్భంగా సంజనా మాట్లాడుతూ.. ''మా ఇంటి సమీపంలో ఉన్న ఆరు వందలకు పైగా ప్రజలకు ఆరు రోజులుగా అన్నదానం చేస్తున్నాను. ఎవరి పాత్రలు వారు తెచ్చుకుంటున్నారు. వారికి కావలసిన పదార్ధాలు ఇస్తున్నాం. నేను చాలా సేఫ్‌గా సర్వ్‌ చేస్తున్నా. చాలా బాధగా ఉంది. 
 
లాక్‌డౌన్‌ ఉన్నంతా కాలం నా ఇంటి దగ్గర అన్నదానం ఉంటుంది. మద్యం, సిగిరెట్‌ అలవాటు, బీపీ. షుగర్‌ లేని వ్యక్తులు, మరో 25 ఏళ్లు బతకాల్సిన వారు కూడా తిరుగుతూ తిరుగుతూ మరణిస్తున్నారు. ఈ కరోనా దరిద్రం త్వరగా పోవాలని కోరుకుంటున్నా'' అని సంజనా పేర్కొన్నారు.