మంగళవారం, 8 జులై 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. ట్రెండింగ్
Written By సెల్వి
Last Updated : సోమవారం, 7 జులై 2025 (19:36 IST)

Varshini: లేడీ అఘోరీని పట్టించుకోని శ్రీ వర్షిణి.. ట్రెండింగ్‌ రీల్స్‌ చేస్తూ ఎంజాయ్ చేస్తోంది..! (video)

Varshini Aghori
Varshini Aghori
తెలుగు రాష్ట్రాల్లో లేడీ అఘోరీ, శ్రీ వర్షిణి వ్యవహారం సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. అనంతరం అఘోరీని పోలీసులు అరెస్ట్ చేశారు. అదే సమయంలో శ్రీవర్షణీకి దాదాపు 45 రోజుల పాటు కౌన్సిలింగ్ ఇచ్చి ఇటీవలే రిలీజ్ చేశారు. జైలు నుంచి బయటికి వచ్చిన శ్రీవర్షిణి ఎక్కడా కనిపించలేదు. 
 
తాజాగా కొత్త లుక్‌లో దర్శనమిచ్చింది. అద్భుత హెయిర్ కట్‌తో బర్గర్ టైమ్ అంటూ న్యూ లుక్‌లో కనిపించి అందరికీ షాక్ ఇచ్చింది. 45 రోజుల కౌన్సిలింగ్ తర్వాత ఆమె బయటకొచ్చి సోషల్ మీడియాలో యాక్టివ్ అయింది. రీల్స్ చేస్తూ ఫాలోవర్లను సంపాదించుకుంటుంది. బయట ఉన్న శ్రీవర్షిణీ అఘోరీని పూర్తిగా మర్చిపోయినట్లు అర్థం అవుతోంది. 
 
అఘోరీ జైల్లో ఉంటే బయట శ్రీవర్షిణి మాత్రం ట్రెండింగ్‌ రీల్స్‌ చేస్తూ లైక్స్, వ్యూస్ సంపాదించుకుంటుంది. యూట్యూబ్‌ ఛానల్‌లో రోజూ రీల్స్ అప్‌లోడింగ్‌ చేస్తుంది. పాటలు పాడుతూ, డ్యాన్స్‌ వేస్తూ శ్రీవర్షిణి బాగా ఎంజాయ్ చేస్తుంది. ప్రస్తుతం ఆ రీల్స్ కాస్త వైరల్‌గా మారాయి.