సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By సెల్వి
Last Updated : బుధవారం, 26 మే 2021 (13:27 IST)

నటి గీతాంజలికి ఆన్‌లైన్‌‌లో వేధింపులు.. ఫోటో మార్ఫింగ్ చేసి..?

Geethanjali
హీరోయిన్స్‌కు ఆన్‌లైన్ వేధింపులు రోజు రోజుకీ ఎక్కువైపోతున్నాయి. వారి ఫొటోలని మార్ఫింగ్ చేసి అసభ్యకరమైన ఫొటోలను ఆన్‌లైన్‌లో షేర్ చేయడం వంటివి చేస్తున్నారు. గతంలో పూజా హెగ్డే, ప్రియమణి, యాంకర్ శ్రీముఖి.. వంటి వారికి ఈ వేధింపులు ఎదురు కాగా, తాజాగా.. నటి గీతాంజలి ఇలాంటి సమస్యనే ఎదుర్కొంది. ఆమె ఫొటోను కొందరు గుర్తు తెలియని వ్యక్తులు డేటింగ్ వెబ్ సైట్లో ఉంచడంతో పోలీసులకి ఫిర్యాదు చేసింది.
 
'శీలవతి' వంటి సినిమాల్లో నటించిన గీతాంజలి (ఫ్రూటీ) ఫొటోను ఓ డేటింగ్ యాప్ లో పెట్టారు కొందరు వ్యక్తులు. ఈ విషయం ఆలస్యంగా తెలుసుకున్న గీతాంజలి.. వెంటనే సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించింది.
 
తన ఫొటోలు డేటింగ్ సైట్లో ఉంచడంతోపాటు.. తనను వేధిస్తున్నారని ఆమె ఫిర్యాదు చేసినట్టు సమాచారం. కాగా, ఇటీవల సింగర్ మధుప్రియ కూడా తనకు కొన్ని నంబర్ల నుంచి బ్లాంక్ కాల్స్ వస్తున్నాయి షీ టీమ్ ను ఆశ్రయించిన సంగతి తెలిసిందే.