శనివారం, 28 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. హాలివుడ్
Written By ముర‌ళీకృష్ణ‌
Last Updated : మంగళవారం, 25 మే 2021 (13:21 IST)

తేనె టీగ‌ల‌కు బాడీని అప్ప‌గించిన ఏంజెలీనా జోలీ

Angelina Jolie
హీరోయిన్లు ఫొటో షూట్ కోసం ర‌క‌ర‌కాల ప్ర‌యోగాలు చేస్తూనే వుంటున్నారు. ఒక‌రికంటే మ‌రొక‌రు భిన్నంగా ఫొటోలకు ఫోజులిస్తూంటారు. మ‌రికొంతమంది మాత్రం కేవ‌లం త‌మ అందాల‌ను ఆర‌బోస్తూ కుర్ర‌రారుని వేడెక్కిస్తుంటారు. అయితే హాలీవుడ్‌కు చెందిన ఏంజెలీనా జోలీ మాత్రం ఓ కొత్త ప్ర‌యోగాన్ని చేసింది. హేక‌ర్స్‌, సాల్ట్‌, ద గుడ్ స్టెఫ‌ర్డ్, మిస్ట‌ర్ అండ్ మిసెస్ స్మిత్ సినిమాల‌తో ఆక‌ట్టుకున్న జోలి ఒక‌టి కాదు రెండు కాదు ఏకంగా 18 నిముషాల పాటు త‌న దేహాన్ని తేనెటీగ‌ల‌కు అప్ప‌గించేసింది. వీటిని ఆమె అభిమానులు ఆశ్చ‌ర్య‌పోతుంటారు. మ‌రికొంద‌రు తేనెటీగ‌ల‌ రాణి అంటూ ఇంకొంత‌మంది పికాసో బొమ్మ‌కు అద్దిన మ‌చ్చ‌లు అంటూ ప‌లుర‌కాలుగా కామెంట్ చేస్తున్నారు. 
 
తేనెటీగ‌లు కుడితే ప‌రిస్థితి ఏమిటి? అని మ‌రో అభిమాని అడిగింది. దీనిపై ఏంజెలీనా జోలీ స్పందించింది. ఇది నేష‌న‌ల్ జియోగ్ర‌ఫీ ఛాన‌ల్ స‌హ‌కారంతో చేశాను. ఇవి ఇటాలియ‌న్ తేనెటీగ‌లు. వాటినే వారు ఉప‌యోగించారు. సెట్లో అంద‌రూ ర‌క్ష‌ణ కోట్లు ధ‌రించారు. నాకు మాత్రం కోటు వేయ‌లేదు. దీనికోసం బాడీని కూడా త‌గిన విధంగా జాగ‌త్ర‌గా మ‌లిచారు అని పేర్కొంది. మ‌రి ఇంత క‌ష్ట‌ప‌డిన ఫొటో షూట్‌కు భారీగానే ఆమెకు ముట్టింది.  ఆ విష‌యాన్ని ప్ర‌స్తావించ‌కుండా దాట‌వేసింది. ఏది ఏమైనా ఇలాంటి ప్ర‌యోగాలు చేసిన సెక్సీ బ్యూటీని చాలా మంది అభినందిస్తున్నారు.