ఆదివారం, 29 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. హాలివుడ్
Written By ముర‌ళీకృష్ణ‌
Last Updated : మంగళవారం, 18 మే 2021 (13:05 IST)

హిట్ల‌ర్‌, స్టాలిన్‌కు న‌చ్చిన ద‌ర్శ‌కుడు

Frank Capra
ఇట‌లీలో పుట్టి అమెరిక‌న్ ద‌ర్శ‌కుల్లో మేటి స్థానాన్ని సంపాదించిన ద‌ర్శ‌కుడు ఫ్రాంక్ కేప్రా. ఇత‌ను 1897, మే 18న జ‌న్మించాడు. సెప్టెంబ‌ర్ 3, 1991లో కాలం చేశాడు. 1930లో అమెరిక‌న్ ద‌ర్శ‌కుల్లో ఆయ‌న ప్ర‌భావం తీవ్రంగా వుండేది. అత‌ని సినిమాలో సామాజిక కోణం, స‌మ‌స్య‌లు క‌ళ్ళ‌కు క‌ట్టిన‌ట్లు వుండేవి. అందుకే ఆయ‌న సినిమాలంటే నియంత‌ల‌కే న‌చ్చేవి.
 
జర్మన్ నియంత హిట్లర్, రష్యన్ నియంత స్టాలిన్ లకు బాగా నచ్చిన సినిమా ఒకటి ఉంది. ఆ సినిమా పేరు ‘ఇట్ హేపెన్డ్ వన్ నైట్’. 1934 లో వచ్చిన ఈ రొమాంటిక్ కామెడీ ఆధారంగా ప్రపంచవ్యాప్తంగా బోలుడన్ని సినిమాలు వచ్చాయి. అంతెoదుకు ‘రోమన్ హాలిడే’ (1953) మూవీ కి కూడా ఇదే మూలం. 1946 లో వచ్చిన ‘ఇట్స్ ఎ వండర్ ఫుల్ లైఫ్’ వరల్డ్ బెస్ట్ మూవీస్ లో ఒకటి. ఒక గ్రీటింగ్ కార్డ్ ఆధారంగా ఈ సినిమా తీశారంటే నమ్మశక్యoగా అనిపించదు. ఈ రెండు సినిమాలు సృస్టికర్త ‘ఫ్రాంక్ కాప్రా’. ఇప్పటికీ చాలామందికి ఫేవరెట్ డైరెక్టర్ ఈయన. నేడు ఫ్రాంక్ కాప్రా జ‌యంతి.
 
రెండవ ప్రపంచ యుద్ధం తరువాత, ఇప్రాస్ ఎ వండర్ఫుల్ లైఫ్ (1946) వంటి చిత్రాలు మొదట విడుదలైనప్పుడు పేలవంగా ప్రదర్శించడంతో కాప్రా కెరీర్ క్షీణించింది. అయితే, తరువాతి దశాబ్దాలలో, ఇట్స్ ఎ వండర్ఫుల్ లైఫ్, ఇంకా ఇతర కాప్రా చిత్రాలను విమర్శకులను సైతం ఆక‌ర్షించాయి. కాప్రా వివిధ రాజకీయ, సామాజిక కార్యకలాపాలలో నిమగ్నమై చిత్ర పరిశ్రమలో చురుకుగా ఉన్నారు. అతను అకాడమీ ఆఫ్ మోషన్ పిక్చర్ ఆర్ట్స్ అండ్ సైన్సెస్ అధ్యక్షుడిగా పనిచేశాడు, రైటర్స్ గిల్డ్ ఆఫ్ అమెరికాతో కలిసి పనిచేశాడు.