శుక్రవారం, 27 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By సెల్వి
Last Updated : మంగళవారం, 31 మే 2022 (17:15 IST)

శ్రీవారి భక్తులకు శుభవార్త: వ‌ర‌ల్డ్ క్లాస్ రైల్వే స్టేష‌న్‌గా తిరుప‌తి

Tirupati
Tirupati
శ్రీవారి భక్తులకు శుభవార్త. క‌లియుగ దైవం తిరుమ‌ల శ్రీవేంక‌టేశ్వ‌ర స్వామి దర్శనార్థం తిరుపతికి వెళ్లే భక్తులకు ఇది తప్పకుండా గుడ్ న్యూసేనని చెప్పాలి. 
 
తిరుప‌తిలోని రైల్వే స్టేష‌న్ నిత్యం రద్దీగానే ఉంటుంది.  అయితే ఆ ర‌ద్దీకి త‌గ్గ‌ట్టుగా రైల్వే స్టేష‌న్‌లో ఇప్ప‌టిదాకా పెద్దగా అభివృద్ధి చేసిన దాఖ‌లా మాత్రం క‌నిపించ‌దు. కానీ తాజాగా వ‌ర‌ల్డ్ క్లాస్ రైల్వే స్టేష‌న్‌గా తిరుప‌తి రైల్వే స్టేష‌న్ మారిపోబోతోంది. 
 
తిరుప‌తి వ‌ర‌ల్డ్ క్లాస్ రైల్వే స్టేష‌న్‌కు సంబంధించిన డిజైన్లు ఇప్ప‌టికే పూర్తి కాగా... ఆయా ప‌నుల‌ను వేర్వేరు కాంట్రాక్ట‌ర్ల‌కు క‌ట్ట‌బెట్ట‌డం కూడా జ‌రిగిపోయింది. ఇందుకు సంబంధించిన ఫోటోలు నెట్టింట వైరల్ అవుతున్నాిపనులు కూడా శ‌ర‌వేగంగా జ‌ర‌గ‌నున్నాయి. 
 
ఈ మేర‌కు రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణ‌వ్ సోమ‌వారం రాత్రి పొద్దుపోయిన త‌ర్వాత వ‌ర‌ల్డ్ క్లాస్ తిరుప‌తి రైల్వే స్టేష‌న్ డిజైన్ల ఫొటోల‌ను ట్విట్ట‌ర్‌లో విడుద‌ల చేశారు. అంతేకాకుండా టెండ‌ర్ల‌న్నీ పూర్త‌య్యాయ‌ని, త్వ‌ర‌లోనే ప‌నులు మొద‌లు కానున్నాయ‌ని తెలిపారు.