బుధవారం, 16 అక్టోబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. కరెంట్ అపైర్స్
Written By సెల్వి
Last Updated : మంగళవారం, 17 మే 2022 (15:22 IST)

తిరుపతిలో బ్యూటీ పార్లర్ ప్రారంభించిన మంత్రి రోజా

Roja
టూరిజం మంత్రి రోజా తిరుపతిలో బ్యూటీ పార్లర్ ప్రారంభించారు. లండన్ బ్యూటోరియం బ్రాంచ్‌ను  ప్రారంభించారు. బెంగళూరు, చెన్నై, హైదరాబాదుల్లో లభించే నాణ్యమైన సేవలు ఇప్పుడు తిరుపతికి కూడా అందుబాటులోకి వచ్చాయని రోజా చెప్పారు. ఈ సందర్భంగా బ్యూటీ క్లినిక్ హెడ్ జీవిత సత్యనారాయణన్, బ్రాంచ్ ఓనర్ ప్రియాంకను ఆమె అభినందించారు. 
 
పార్లర్ ప్రారంభోత్సవం సందర్భంగా పార్లర్‌లో రోజా కలియతిరుగుతూ... మహిళలకు అందించబోయే సేవల గురించి తెలుసుకున్నారు. అంతేకాదు స్వయంగా బ్లూటీ పార్లర్‌కు చెందిన ప్రొఫెషనల్‌తో నెయిల్ కటింగ్ చేయించుకున్నారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ, చెన్నై బేస్డ్ లండన్ బ్యూటోరియం బ్రాంచ్‌ను ప్రారంభించడం పట్ల హర్షం వ్యక్తం చేశారు.