శనివారం, 28 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. గుసగుసలు
Written By ఐవీఆర్
Last Updated : సోమవారం, 11 జులై 2022 (23:06 IST)

పవిత్రా లోకేష్ నా భార్యే... కానీ మ్యారేజ్ సర్టిఫికేట్ లేదు: పవిత్ర మొదటి భర్త సుచేంద్ర

Pavitra Lokesh
పవిత్రా లోకేష్, సీనియర్ నటుడు నరేష్ పెళ్లి వార్త ప్రస్తుతం టాలీవుడ్లో హాట్ టాపిక్‌గా మారింది. ఈ జంట కొంతకాలంగా డేటింగ్‌లో ఉన్నారని, త్వరలో పెళ్లి చేసుకోబోతున్నారని ప్రచారం జరుగుతోంది. అయితే కొన్ని రోజులుగా ఈ వార్త ప్రచారంలో ఉన్నా నరేష్, పవిత్ర లోకేష్ మాత్రం ఆ వార్తలను ఖండించలేదు. మరోవైపు వీరిద్దరూ మహాబలేశ్వర్‌లో స్వామివారి ఆశీస్సులు తీసుకుంటున్న వీడియో వైరల్‌ అయ్యింది.

 
నరేష్ మూడు పెళ్లిళ్ల నేపథ్యం గురించి దాదాపు ఇప్పటికే తెలిసిపోయింది. కానీ పవిత్ర లోకేష్ మొదటి భర్త గురించి చాలా కొద్దిమందికి మాత్రమే తెలుసు. పవిత్ర లోకేష్ మొదటి భర్త పేరు సుచేంద్ర ప్రసాద్. వీరు 2007లో వివాహం చేసుకున్నారు. సుచేంద్ర ప్రసాద్ కూడా అప్పటికే వివాహం చేసుకున్నారు. పవిత్ర లోకేష్ కంటే ముందే మల్లిక అనే మహిళతో వివాహం జరిగింది. 2007లో తన మొదటి భార్యకు విడాకులు ఇచ్చిన సుచేంద్ర ప్రసాద్ అదే సంవత్సరం పవిత్ర లోకేష్‌ను వివాహం చేసుకున్నాడు. ఆ తర్వాత ఆమెకు దూరంగా ఉంటున్నాడని ప్రచారం జరుగుతోంది. పవిత్ర లోకేష్‌కు ఒక కుమార్తె, కుమారుడు ఉన్నారు.

 
శనివారం హఠాత్తుగా సుచేంద్ర మీడియాతో మాట్లాడారు. పవిత్ర లోకేష్ తన భార్యేనంటూ చెప్పుకొచ్చాడు. ఐతే తాము వివాహం చేసుకున్న తర్వాత తమ పెళ్లిని రిజిస్టర్ చేయాలని అనుకోలేదన్నాడు. అందువల్ల తమ వివాహానికి సంబంధించిన మ్యారేజ్ సర్టిఫికెట్ లేదని చెప్పాడు. ఇంకోవైపు... తను సుచేంద్రను పెళ్లాడలేదని పవిత్రా లోకేష్ చెపుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఏదేమైనప్పటికీ పవిత్రా లోకేష్-నరేష్ కలిసి జంటగా తిరుగుతున్నారు. వీరికి ఆల్రెడీ పెళ్లి అయిపోయిందనే వార్తలు టాలీవుడ్ ఇండస్ట్రీలో హల్చల్ చేస్తున్నాయి.