సోమవారం, 20 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By సెల్వి
Last Updated : గురువారం, 7 జులై 2022 (18:46 IST)

పంజాబ్ సీఎం భగవంత్ మాన్ రెండో పెళ్లి..

Punjab CM
Punjab CM
పంజాబ్ సీఎం భగవంత్ మాన్ రెండో సారి వివాహం చేసుకున్నారు. హర్యానాకు చెందిన 32 ఏళ్ల గుర్ ప్రీత్ కౌర్‌ను ఆయన వివాహమాడాడు. 
 
భగవంత్ మాన్ వయసు 48 ఏళ్లు కాగా, ఆయన కంటే గుర్ ప్రీత్ 16 ఏళ్లు చిన్నది. ఈ పెళ్లికి చండీగఢ్‌లోని భగవంత్ మాన్ నివాసం వేదికగా నిలిచింది. కొద్దిమంది కుటుంబ సభ్యులు, బంధుమిత్రుల సమక్షంలో వీరి వివాహం సిక్కు సంప్రదాయాల ప్రకారం జరిగింది. 
 
ఈ పెళ్లికి ఆప్ అధినేత, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ కుటుంబ సమేతంగా హాజరయ్యారు. అయితే, ఈ పెళ్లికి ఏ ఒక్క పంజాబ్ మంత్రిని, ప్రముఖ నేతలను పిలవలేదని తెలుస్తోంది.  
 
2015లో భగవంత్ మాన్ మొదటి భార్య ఇందర్ ప్రీత్ కౌర్‌కు విడాకులు ఇచ్చారు. వీరికి ఇద్దరు సంతానం ఉన్నారు. ఇందర్ ప్రీత్ కౌర్ తన పిల్లలు సీరత్ కౌర్ మాన్ (21), దిల్షాన్ మాన్ (17)లతో కలిసి అమెరికాలో ఉంటున్నారు. ఇక డాక్టర్ గుర్ ప్రీత్ తో సీఎం భగవంత్ మాన్‌కు చాన్నాళ్లుగా పరిచయం ఉంది.