నా దగ్గర పనిచేసే డ్రైవర్‌తో ఎఫైర్ పెట్టుకుంది నా మూడో భార్య: నటుడు నరేష్ సంచలన వ్యాఖ్యలు
సీనియర్ నటుడు నరేష్, క్యారెక్టర్ ఆర్టిస్ట్ పవిత్రా లోకేష్ పేరు మారుమోగిపోతోంది. వాళ్లిద్దరూ నాలుగో పెళ్లి చేసుకోబోతున్నారంటూ ఒకటే చర్చ జరుగుతోంది. దీనిపై పవిత్రా లోకేష్ వివరణ ఇచ్చేసారు. పెళ్లీ లేదు గిళ్లీ లేదని అని కొట్టిపారేశారు.
ఇకపోతే నరేష్ మాత్రం వేరేగా మాట్లాడారు. కన్నడ మూవీలో నటిస్తున్న నరేష్ బెంగళూరులో మాట్లాడుతూ... తన మూడో భార్య రమ్యపై సంచలన వ్యాఖ్యలు చేసారు. తన మూడో భార్య రమ్య తనతో ఎప్పుడూ భార్యలా ప్రవర్తించలేదన్నారు. ఇంట్లో ఫంక్షన్ పెడితే మేల్ క్యాబరే డాన్సర్‌ను తీసుకొచ్చి హంగామా చేస్తుందన్నారు.
ఆమెకి నా దగ్గర పనిచేసే కారు డ్రైవరుతో ఎఫైర్ వుందనీ, ఆ విషయంపై నిలదీస్తే చెత్త వివరణలు ఇచ్చిందంటూ మండిపడ్డారు. అందుకే చేయిదాటిపోయిందని తెలుసుకుని ఆమెకి విడాకులు ఇచ్చానని చెప్పుకొచ్చారు. ఐతే... పవిత్రా లోకేష్ తమ చిచ్చు పెట్టిందని రమ్య ఆరోపిస్తున్నారు.