సంబంధిత వార్తలు
- అవకాశం కోసం ఎదురుచూశాను - సుమంత్.
- బాలీవుడ్లో ఆఫర్లే ఆఫర్లు.. బిజీ బిజీగా వున్న రష్మిక మందన్న
- దుల్కర్ సల్మాన్- సీతా రామం సెకండ్ సింగిల్ లిరికల్ వీడియో విడుదల
- పుష్ప నటనతో బాలీవుడ్‌కు శ్రీవల్లి.. అంతా సామి సామి మాయే..!
- వీగన్ స్కిన్‌కేర్ బ్రాండ్ ప్లమ్‌లో ఇన్వెస్టర్, బ్రాండ్ అంబాసిడర్‌గా చేరిన రష్మిక మందన్న
ఆఫ్రీన్‌గా రష్మిక మందన్న
Rashmika Mandanna
ముస్లిం సోదరుల పవిత్ర పండుగ ఈద్ ఉల్-అధా పర్వదినం సందర్భంగా.. రష్మిక పాత్రకు సంబధించిన ప్రత్యేక పోస్టర్ విడుదల చేశారు. హిజాబ్ ధరించిన రష్మిక మందన్న ఈద్ ఉల్-అధా శుభాకాంక్షలను తెలియజేస్తున్న ఈ పోస్టర్ ఈద్ పర్వదినానికి ప్రత్యేకంగా నిలిచింది. ఈ చిత్రంలో రష్మిక చాలా కీలకమైన పాత్ర పోషిస్తున్నారు, కాశ్మీరీ ముస్లిం అమ్మాయి అఫ్రీన్ గా కనిపించనుంది.
దుల్కర్ సల్మాన్, మృణాల్ ఠాకూర్ రామ్, సీతగా ఈ చిత్రంలో కనిపించనున్నారు. బ్రిగేడియర్ విష్ణు శర్మగా సుమంత్ కీలక పాత్ర పోషిస్తుండగా, అతని ఫస్ట్ లుక్ పోస్టర్ నిన్న విడుదలైంది. పోస్టర్‌లో సుమంత్ లుక్స్ కు విశేష స్పందన వచ్చింది.
''సీతా రామం' సంబంధించిన ప్రతి అప్‌డేట్ సినీ అభిమానులను సర్ ప్రైజ్ చేస్తోంది. 1965 బ్యాక్‌డ్రాప్‌లో తెరకెక్కిన ఈ సినిమా టీజర్‌కి, పాటలకు అద్భుతమైన స్పందన వచ్చింది. ''సీతా రామం' ఎపిక్ క్లాసిక్ కాబోతుందనే అంచనాలని పెంచుతోంది.
టాలీవుడ్ ప్రతిష్టాత్మక నిర్మాణ సంస్థ వైజయంతీ మూవీస్ ఈ చిత్రాన్ని భారీ నిర్మిస్తోంది. ఈ క్లాసిక్ రొమాంటిక్ కు విశాల్ చంద్రశేఖర్ సంగీతం అందిస్తున్నారు. తెలుగు, తమిళం, మలయాళం భాషల్లో ఏకకాలంలో రూపొందుతున్న ఈ చిత్రానికి పీఎస్ వినోద్ సినిమాటోగ్రాఫర్. విశాల్ చంద్రశేఖర్ సంగీతం అందిస్తున్నారు. ఆగస్ట్ 5న ఈ చిత్రాన్ని ప్రపంచవ్యాప్తంగా విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు.
